‘ఐకాన్’ తో సుకుమార్ కు భలే చిక్కొచ్చి పడిందే..!

ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. దసరాకు విడుదల అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే సుకుమార్ మొదట పుష్పను ఒక సినిమాగానే తీయాలనుకున్నారు. కానీ చెప్పే కథ ఇంకా ఉండడంతో రెండు భాగాలుగా తీద్దామని చెప్పి అల్లు అర్జున్ ను కూడా ఒప్పించాడు.

ఈ నిర్ణయం తీసుకొని కూడా చాలా నెలలు అయ్యింది. అయితే పుష్ప సినిమా పూర్తయిన వెంటనే పుష్ప -2 సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని సుకుమార్ భావిస్తున్నాడట. అయితే మొదటి భాగం థియేటర్ లో విడుదలైన తర్వాత రెండో భాగం చిత్రీకరణ మొదలుపెట్టడానికి కాస్త సమయం పడుతుందని, ఈ లోగా వేణు శ్రీరామ్ తో ఐకాన్ మూవీ కంప్లీట్ చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసిన తర్వాత పుష్ప -2 యూనిట్ తో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు.

అయితే అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ పూర్తయిన తరువాత మరో సినిమాకు డేట్స్ కేటాయించడం సుకుమార్ కు ఇష్టం లేదని సమాచారం. పుష్ప సినిమా షూటింగ్ పూర్తయి విడుదల కాగానే, వెంటనే సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు పెట్టాలని ఆయన ఆలోచిస్తున్నారట. ఒక వేళ సెకండ్ పార్ట్ షూటింగ్ లో ఆలస్యం చోటు చేసుకుంటే కంటిన్యుటీ దెబ్బతింటుందని ఆయన భావిస్తున్నారట. పుష్ప పూర్తయిన తర్వాత పుష్ప -2 మొదలుపెడితేనే తనకు సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నారట. ఈ విషయమై అల్లు అర్జున్, సుకుమార్ ఆలోచనలో పడిపోయినట్లు సమాచారం.

Also Read

ఇంతకీ పవన్ సినిమాలో హీరోయిన్ ఎవరూ? నిత్యానా, సమంతానా..!

ఆచార్య విడుదలపై అంతా గందరగోళం..!

Related Articles

Most Populer

Recent Posts