Sunday, May 4, 2025
- Advertisement -

అభిమానుల్లో మొద‌లైన ‘అజ్ఞాత వాసి’ హంగామా ….

- Advertisement -

టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్-పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వస్తున్న ‘అజ్ఞాత వాసి’ హంగామా మొదలైందనే చెప్పాలి. ఇప్పటికే ఫస్ట్ లుక్, సాంగ్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ప్ర‌స్తుతం షూటింగ్ కంప్లీట్ చేస‌కున్న సినిమా ఆడియో రిలీజ్ ఈనెల 19 తేదీల్లో ఒకరోజు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ చేయబోతున్నారు.

అయితే ఈసినిమాకు ఇద్ద‌రు స్టార్ హీరోలు ముఖ్య అథిదులుగా హాజ‌ర‌వ్వ‌నున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి ముఖ్య అథిదిగా రానుండ‌గా ..ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నారని వార్తలు రావడంతో ‘అజ్ఞాతవాసి’ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం అటు మెగా ఇటు నందమూరి అభిమానులు తెగ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్న తారక్‌కు, త్రివిక్రమ్ ఫోన్ చేశాడని, దానికి తారక్ కూడా ఓకే చెప్పేశాడని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే ఇద్దరు హీరోల అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనడంలో సందేహం లేదు. గతంలో త్రివిక్రమ్‌-తారక్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ ముఖ్య అతిథిగా వేచ్చేసిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -