ఎన్టీఆర్ సినిమాకి యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్..!

- Advertisement -

అనిరుధ్ రవిచంద్రన్ తమిళనాడులో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. చిన్న వయసులోనే అగ్రస్థాయికి చేరుకున్నాడతడు. 2012లో ధనుష్ నటించిన ‘త్రీ’ సినిమా లో అనిరుధ్ మ్యూజిక్ అందించిన వై దిస్ కొలెవరి డీ పాట ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. దీంతో అనిరుధ్ పేరు మార్మోగింది. ఆ తర్వాత 2014లో విజయ్ హీరోగా నటించిన కత్తి సినిమాకు కత్తి సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ కావడంతో అనిరుధ్ కోలీ వుడ్ లో టాప్ రేంజ్ కు చేరుకున్నాడు.ఆ తర్వాత అనిరుధ్ యువ స్టార్ హీరోలతో పాటు రజినీకాంత్ సినిమాకు కూడా మ్యూజిక్ అందించే స్థాయికి చేరుకున్నాడు.

2018లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా తో అనిరుధ్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలోని పాటలు బాగున్నప్పటికీ మూవీ ప్లాప్ అయ్యింది. దీంతో అతడికి పేరు రాలేదు. ఆ తర్వాత నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా కు అద్భుతమైన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందించాడు. తర్వాత నాని నటించిన మరో సినిమా గ్యాంగ్ లీడర్ కూడా అతడే మ్యూజిక్ ఇచ్చాడు.

- Advertisement -

ఇప్పుడు మరోసారి అనిరుధ్ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నాడు. మామూలుగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నింటికీ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. అయితే ఆచార్య సినిమాకు మాత్రం మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. చిరంజీవి సిఫార్సు కారణంగానే కొరటాల శివ మణిశర్మ కు ఛాన్స్ ఇచ్చి ఉంటాడని అంతా భావించారు. తన తర్వాత సినిమాకు కచ్చితంగా మళ్లీ దేవిశ్రీనే మ్యూజిక్ అందిస్తారని భావించారు.

అయితే మరోసారి కొరటాల శివ వేరే సంగీత దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. ఇటీవల మాంచి ఫామ్లో ఉన్న కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు ఎన్టీఆర్ తో చిత్రానికి అవకాశం కల్పించాడు. అజ్ఞాతవాసి కి దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ ఆ తర్వాత సినిమాగా అరవింద సమేత వీర రాఘవ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకు మొదట అనిరుధ్ నే సంగీతం అందిస్తాడని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆ ప్లేస్ లోకి తమన్ వచ్చి చేరాడు. ఎట్టకేలకు ఎన్టీఆర్ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ కొరటాల శివ ద్వారా అనిరుధ్ దక్కించుకున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Also Read

దాక్కో దాక్కో మేక.. పులి వచ్చేసింది..!

చైతూ ‘లవ్ స్టోరీ’ తో వచ్చేస్తున్నాడు.. విడుదల ఎప్పుడంటే..!

సుకుమార్, మహేష్ మధ్యే మనస్పర్థలు తొలగినట్టేనా..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -