Friday, April 26, 2024
- Advertisement -

మెగాస్టార్ ‘భోళా శంకర్’ అవతారం..!

- Advertisement -

ఇవాళ మెగాస్టార్ జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఆయన కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఆయన నటిస్తున్న కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వరుసగా వస్తున్నాయి. కొద్ది రోజులుగా తమిళంలో అజిత్ హీరోగా నటించి సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాను తెలుగులో చిరంజీవి చేస్తారని టాక్ వస్తోంది. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తారని కూడా ప్రచారం జరిగింది. అదే ఇప్పుడు నిజమైంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ ను చిరంజీవి చేస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ గా భోళా శంకర్ అని అఫీషియల్ గా కూడా ప్రకటించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ చేస్తూ మహేష్ బాబు చిరంజీవి కి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ‘ మీరెంతో ఆయురారోగ్యాలతో ఉంటూ విజయాలను అందుకోవాలి. ఆల్ ద బెస్ట్ సార్ అంటూ’ మహేష్ బాబు చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా మెహర్ రమేష్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో ఏళ్ళు గడిచినా ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా సాధించలేదు. ఆయన దర్శకత్వం వహించిన బిల్లా, కంత్రీ, శక్తి, షాడో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా మిగిలాయి. దీంతో ఆయన కొన్ని సంవత్సరాలుగా దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. ఇక మళ్లీ ఆయన సినిమాలకు దర్శకత్వం వహించారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా మెహర్ రమేష్ కు చిరంజీవి పిలిచి ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఈ సినిమాను ఎలాగైనా సూపర్ హిట్ చేయాలన్న కసితో మెహర్ రమేష్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: మెగా, నందమూరి కాంబినేషన్ మరోసారి.. ఈ సారి హీరోలు ఎవరెవరో తెలుసా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -