ఖిలాడి నుంచి ఫస్ట్ సింగిల్.. వచ్చేది ఎప్పుడో తెలుసా..!

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం ఖిలాడి. డింపుల్ హయాతి మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏ స్టూడియోస్ హవిష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు ఆగిపోయింది. ప్రస్తుతం వైరస్ తీవ్రత తగ్గడంతో మళ్లీ చిత్రీకరణ మొదలు పెట్టారు.

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మూడు పాటలు మాత్రం చిత్రీకరించాల్సి ఉంది. అతి త్వరలోనే ఈ మూడు పాటలను కూడా పూర్తి చేయనున్నట్లు దర్శకుడు రమేష్ వర్మ తాజాగా తెలిపారు. కాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ 10వ తేదీన విడుదల కానుంది. ఇవాళ రమేష్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు నిర్మాతలు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఒక చిన్న ప్రోమోను కూడా విడుదల చేశారు.

రవితేజకు చాలా ఏళ్ల తర్వాత క్రాక్ వంటి సూపర్ హిట్ అవడంతో ఆయన జోరుమీద ఉన్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నూతన డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా రవితేజ మొదలుపెట్టాడు. ఇటీవల రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రాక్షసుడు సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఖిలాడి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Also Read: విజయ్ దేవరకొండ లైనప్ మామూలుగా లేదు.. లైన్లో నలుగురు టాప్ డైరెక్టర్లు..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -