చిరు బర్త్ డే : షేక్ అవుతున్న సోషల్ మీడియా..!

- Advertisement -

ఇవాళ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. అభిమానులకు పండగ రోజు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సహచర నటీ నటులు, అభిమానులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలిపారు.

చిరంజీవి బర్త్ డే హంగామా అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలైంది. యూట్యూబ్, ట్విటర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ లలో చిరంజీవి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వేలాదిగా కామెంట్స్ వస్తున్నాయి. బర్త్ డే సందర్భంగా అభిమానులు చిరంజీవి డీపీని పెట్టుకున్నారు. ‘ నాకు గైడ్, నన్ను ప్రోత్సహించే చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇకపై మీరు మీ జీవితంలో మునుపటి కంటే ఎక్కువ సక్సెస్ ని చూడాలి’ అని సీనియర్ హీరో వెంకటేష్ బా కాంక్షలు తెలిపారు.

‘హ్యాపీ బర్త్ డే టు యూ మెగా మెగా మెగా మెగా మెగా స్టార్ చిరంజీవి గారు. కాదు భవిష్యత్ తరాలకు కూడా మీరు స్ఫూర్తి సార్’ అని రెబల్ స్టార్ ప్రభాస్ చిరంజీవికి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ‘మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ద డే టు మై అండ్ అవర్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు’ అని ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ట్వీట్ చేశారు. తెలుగు ఫీల్డ్ లో టాప్ 1,2,3 స్థానాలు చిరంజీవే. మళ్లీ ఆయన మరోసారి తెలుగు బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాలని అత్యధిక కలెక్షన్స్ కోరుకుంటూ రచయిత విజయేంద్రప్రసాద్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇంకా శర్వానంద్, సాయి ధరమ్ తేజ్, తమన్, కె.విశ్వనాథ్, కైకాల సత్యనారాయణ, శారద, తమ్మారెడ్డి భరద్వాజ, టి.సుబ్బరామిరెడ్డి, కె.రాఘవేంద్రరావు, బి.గోపాల్, ఎడిటర్ మోహన్, కోదండరామిరెడ్డి, ఎమ్మెల్యే రోజా తదితరులు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: భీమ్లా నాయక్ నుంచి మరొక సర్ప్రైజ్.. సిద్ధమవుతున్న రానా టీజర్..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -