Tuesday, May 7, 2024
- Advertisement -

చిరు క్రేజ్ మాములుగా లేదుగా!

- Advertisement -

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవిది ప్రత్యేకమైన స్థానం. వైవిధ్యమైన కథలు, సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే చిరు…ఎన్నో ఆల్‌టైమ్ హిట్‌లు అందుకున్నారు. ఇక మెగాస్టార్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో ఒకటి ఇంద్ర. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.

ఇక ఈ సినిమా విడుదలై 22 ఏళ్లు దాటినా ఇంద్ర క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. డిసెంబర్‌లో జీ తెలుగులో ఇంద్ర టెలికాస్ట్ కాగా అదిరిపోయే రేటింగ్స్ దక్కించుకుంది. అర్బ‌న్ ప్రాంతాల్లో 5.59 టీఆర్‌పీ, అర్బ‌న్, రూర‌ల్ ప్రాంతాల్లో 5.66 టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇక ఇంద్ర రేటింగ్స్ చూసి ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

2002లో ప్రేక్షకుల ముందుకువచ్చింది ఇంద్ర. బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వహించగా అప్పట్లోనే దాదాపు ప‌దికోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కగా రూ.55 కోట్ల‌ వసూళ్లను రాబట్టింది. తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా ఇంద్ర రికార్డ్‌ సృష్టించింది. రిలీజైన తొలి వారంలోనే ఇర‌వై కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన తొలి మూవీగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. చిరంజీవికి జోడీగా ఆర్తి అగ‌ర్వాల్‌, సోనాలీ బింద్రె హీరోయిన్లుగా న‌టించారు. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లో డ‌బ్ చేసి రిలీజ్ చేయగా అన్ని భాషల్లో మంచి వసూళ్లను రాబట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -