Monday, May 6, 2024
- Advertisement -

అగ్రహీరోలను దాటేసిన తేజ సజ్జా!

- Advertisement -

సంక్రాంతి రేసులో విజేతగా నిలిచారు హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక వసూళ్లలో అగ్రహీరోల సినిమాలను దాటేసింది సరికొత్త రికార్డు సృష్టించారు తేజ. ముఖ్యంగా ఓవర్సీస్‌లో హ‌నుమాన్ కొత్త రికార్డును నెల‌కొల్పింది.

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనే నేను, ప్ర‌భాస్ సాహో, ఆదిపురుష్ రికార్డుల‌ను అధిగమించింది. వారం రోజుల్లో అమెరికాలో హ‌నుమాన్ మూవీ 3.45 మిలియ‌న్ డాల‌ర్ల వసూళ్లను రాబ‌ట్టింది. దీంతో యుఎస్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన ఏడో తెలుగు చిత్రంగా చిలిచింది హనుమాన్.

తెలుగు రాష్ట్రాల్లో క‌లెక్ష‌న్స్‌తో అద‌ర‌గొడుతోంది హనుమాన్‌. ప్రపంచవ్యాప్తంగా ఫ‌స్ట్ వీక్‌లో 130 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టగా సంక్రాంతి సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. వారం రోజుల్లోనే నిర్మాత‌ల‌కు న‌లభై కోట్ల వ‌ర‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను జీ5 సొంతం చేసుకోగా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -