స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన చిత్రం సరైనోడు. బన్నీ సరసన రకుల్, క్యాథరిన్స్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. అయితే ఈ సినిమాపై సీనీ పరిశ్రమలో భారీగా అంచనాలు ఉన్నాయి.
ఈ సరైనోడు చిత్రాన్ని ఇటీవలే స్పెషల్ షో వేసి మరి బన్నీ మెగా స్టార్ చిరంజీవికి చూపించాడట. సరైనోడు సినిమా చుసిన చిరు మేకింగ్ స్టైల్ కు ఫీదా అయిపోయాడట. బన్నీ ని యాక్షన్ యాంగిల్, హీరోయిన్ ల గ్లామర్ ని పక్కగా బోయపాటి శ్రీను ప్రజెంట్ చేసిన తీరును చూసి చిరంజీవి తెగ పోగోడేశాడట. ముఖ్యంగా బన్నీ నటన కంటే బోయపాటి శ్రీనునే చిరు ఎక్కువగా ప్రశంసించారట.
ఎందుకంటే బన్నీ ని యాక్షన్ సీన్స్ లలో కూడా చాలా స్టైలిష్ గా చూపించడం చూసి ఇలా ప్రజెంట్ చేస్తావని అనుకోలేదు అని చిరు బోయపాటి ని పొగడ్తల్లో ముంచెత్తాడట. మొత్తానికి తమ చిత్రానికి చిరు నుండి ప్రశంసల జల్లు కురవడంతో బన్నీ బోయపాటిలు చాలా హ్యాపీ గా ఉన్నారట.