Saturday, May 11, 2024
- Advertisement -

‘సరైనోడు’ మూవీ రివ్యూ!

- Advertisement -

బన్నీ కి క్లాస్ ఫాలోయింగ్ బాగా ఉంది కానీ మాస్ ఫాలోయింగ్ లో మనోడు వెనకపడే ఉన్నాడు. బన్నీ సినిమాల్లో ఇప్పటి వరకూ పూర్తి మాస్ ని మెప్పించినవి చాలా తక్కువ అని చెప్పచ్చు.

మాస్ సినిమాల రారాజు డైరెక్టర్ బోయపాటి తో బన్నీ తీయడం అంటే మొదటి నుంచీ హైప్ దారుణంగా పెరుగుతూ ఒచ్చింది. బద్రీనాథ్ , వరుడు లాంటి యాక్షన్ సినిమాలు తీసినా బన్నీ కి సరిగ్గా సెట్ కాలేదు. బన్నీ యాక్షన్ నీ మాస్ నీ సరిగ్గా చూపించాలి అంటే సరైనోడు బోయపాటి అని అల్లూ అర్జున్ స్వయంగా నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

కథ – పాజిటివ్ లు:

బార్డర్‍లో కంటే సమాజంలోనే ఎక్కువ సమస్యలున్నాయని చెప్పి, గన (అల్లు అర్జున్) తన మిలిటరీ ఉద్యోగాన్ని వదిలేసి హైద్రాబాద్‌లో కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. బాబాయ్ (శ్రీకాంత్)తో కలిసి వ్యవస్థకు అందని నేరగాళ్లకు తన స్టైల్లో బుద్ధి చెప్పడమే గన పని. ఇదిలా సాగుతుండగానే, గన, తానుండే ఏరియాకి ఎమ్మెల్యే అయిన హన్షితా రెడ్డి (క్యాథరిన్ థ్రెసా)తో ప్రేమలో పడతాడు. హన్షితాతో గన పెళ్ళి ఫిక్స్ అవుతున్న సమయంలో, అతణ్ణి వెతుక్కుంటూ, కాపాడమని మహాలక్ష్మి (రకుల్ ప్రీత్) వస్తుంది. అసలు ఆమె అంత సడన్ గా రావడం వెనకాల కారణం ఏంటి ఆమె కీ అతనికీ సంబంధం ఏంటి , ఆమెకి ఒచ్చిన ఆపద ఎలాంటిది ? ఇలాంటి విషయాల నడుమ ఈ సినిమా సాగుతూ ఉంటుంది. అల్లూ అర్జున్ ఈ సినిమా కి మొట్ట మొదటి హై లైట్ గా చెప్పాలి . సినిమా మొత్తం తన బుజాల మీద మోసాడు అర్జున్ , మొదటి నుంచీ కథ పెద్దగా లేకపోవడం తో ఆబధ్యత తీసుకున్న అల్లూ అర్జున్ ఫైట్ లు , డాన్స్ లూ, మ్యానరిజం లతో నెట్టుకుని ఒచ్చేసాడు. యాక్షన్, డైలాగ్ లూ, స్టైల్ అన్నింటా తన మార్క్ ని సృష్టించాడు బన్నీ. తనదైన ఈజ్ నీ స్క్రీన్ ప్రేజెన్స్ నీ చూపించాడు బన్నీ. విలన్ ఆది పినిశెట్టి ఈ పాత్రకి పర్ఫెక్ట్ మాత్రమే కాక తెలుగు సినిమాకి కొత్త విలన్ ఒచ్చినట్టు చూపించాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పట్లానే తాను మంచి నటినేనని మరోసారి నిరూపించుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‍లో రకుల్ నటన చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఇచ్చాడు తమన్. ప్రీ క్లిమాక్స్ సీన్ లు రక్తి కట్టించాయి

నెగెటివ్ లు:

సినిమాకి అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సిన కథ విషయం లో డైరెక్టర్ బోయపాటి నిర్లక్ష్యం చేసాడు. ఒక సాధారణ కథ ని తీసుకుని దాన్ని హీరో మ్యానరిజం లతో అల్లుకుంటూ పోతే సూపర్ హిట్ అయిపోతుంది అనుకున్న అతని ఆలోచన నీరు గారిపోయింది. రెండున్నర గంటలకు పైగా చెప్పాల్సిన స్థాయి ఉన్న కథ కాకపోయినా సినిమాను అంత నిడివిలో చెప్పాలనుకోవడం ఓ మైనస్ పాయింట్‌గానే చెప్పుకోవాలి. అలాగే మాస్ అనే ఆంశాన్నే పట్టుకొని కొన్నిచోట్ల యాక్షన్ సీన్లలో అతి ఎక్కువ చేసినట్లు కనిపించింది. ఈ క్రమంలో హింస, రక్తం చాలా ఎక్కువయ్యాయి. ఇక ఫస్టాఫ్ స్థాయిలో సెకండాఫ్ లేకపోవడం వల్ల సెకండాఫ్ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే నిరుత్సాహం తప్పదు. వ్యవస్థలోని లోపాలను హీరో ఒంటిచేత్తో ఎదుర్కోవడమనే పాయింట్ మాస్ అంశంగా చూస్తే ఫర్వాలేదనిపించినా, ఓవరాల్‌గా చూస్తే ఇదంతా ఓవర్‌గా కనిపిస్తుంది. అదీకాకుండా హీరో మిలిటరీ ఉద్యోగాన్ని వదిలేసి ఎందుకు వచ్చాడన్న దానిపై కూడా పూర్తి క్లారిటీ ఉండదు.

 మొత్తంగా:

మొత్తంగా చూస్తే , సరైనోడు సినిమా మాస్ లో అల్లూ అర్జున్ ని నిలబెట్టడం కోసం చేసిన గట్టి ప్రయత్నం గా చెప్పుకోవచ్చు. ఫార్మాట్ ప్రకారమే సాగే సినిమా అయినా, పొందిగ్గా అల్లిన మాస్ ఎలిమెంట్స్; అదిరిపోయే హీరో, విలన్‌ల క్యారెక్టరైజేషన్, నటన; వినడానికి, చూడడానికి బాగున్న పాటలు; బన్నీ ఒక పూర్తి స్థాయి మాస్ హీరోగా నిలబడగలనని నిరూపించేలా తనని తాను మలుచుకున్న విధానం లాంటివి ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తాయి.  కథ కాస్త కొత్తగా ఉండి ఉంటె బ్లాక్ బస్టర్ పడాల్సిన సినిమా ఇది. మొత్తంగా సమ్మర్ సీజన్ కావడం తో బన్నీ కి మంచి రెవెన్యూ చేస్తుంది ఈ సినిమా అని చెప్పచ్చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -