Sunday, May 19, 2024
- Advertisement -

చిరు మొదలు పెట్టేసాడు!

- Advertisement -

మెగా అభిమానులతో పాటు సినీ పరిశ్రమ కూడా చిరంజీవి 150వ సినిమా సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి చిత్రాన్ని తెలుగులో చిరు 150వ సినిమా గా తీస్తున్నారు. ఈ చిత్రాన్నికి కత్తిలాంటోడు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ చిత్రాన్నికి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయిన షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు.

షూటింగ్ ప్రారంభం కాలేదు అని బాధపడ్డ అభిమానులకు ఇప్పుడు ఓ శుభవార్త వచ్చింది. చిరంజీవి 150వ సినిమా కత్తిలాంటోడు సినిమా షూటింగ్ ఈ నెల 23న హైదరాబాదులో ప్రారంభం కానుంది. అదే రోజున చిరు కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. 23న షూటింగ్ ప్రారంభించి బ్రేకులేకుండా చిత్రీకరణ జరుపుతాం అని యూనిట్ అంటోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అన్న విషయం పై ఇంక క్లారిటీ రాలేదు.

త్వరలోనే ఈ చిత్రంలో నటించే హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నయనతార బాబు బంగారం షూటింగ్ లో బిజీగా ఉంది. ఇది కంప్లీట్ అవ్వగానే మెగాస్టార్ సరసన నటించేందుకు నయనతార ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. ఈ విషయంపై ఇంక అధికరికంగా ఎలాంటి న్యూస్ మాత్రం రాలేదు. ఏది ఎమైనా చిరు చిత్రం షూట్ మొదలు అయ్యింది. ఈ వార్త విని చిరు అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -