Tuesday, May 28, 2024
- Advertisement -

మహేష్ కోసం పవన్ చేసాడో తెలుసా?

- Advertisement -

పవన్ చాలా మంచోడు అని అంతా అంటారు. మంచి తనం అవరసరం అయినప్పుడు బయటకి రావాలి కానీ పదే పదే కాదు. ఈ విషయం లో పవన్ కూడా అంతే. కావాల్సిన వారికి కష్టం వస్తే పవన్ ముందు ఉండి సహాయం చేస్తుంటాడు. ఎవరికైన కష్టం వస్తే తాను మంచోడిగా మారుతాడు పవన్. ఇప్పుడు దర్శకుడు ఎస్ జే సూర్య విషయంలో కూడా ఇదే జరిగింది. పవన్ ప్రస్తుతం చేయబోయే సినిమాకి దర్శకుడు ఎస్ జే సూర్య.  ఫ్యాక్షనిస్ట్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే ఈ కథ కోసం ఏరికోరి మరీ సూర్యను దర్శకుడిగా తీసుకున్నాడు పవన్‌.

గతంలో ఈ దర్శకుడితో పవన్ ఖుషీ, పులి చిత్రాలు చేసాడు. వీటిలో ఖుషీ మంచి విజయం సొంతం చేసుకోగా… పులి డిజాస్టర్‌ గా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత పవన్ తో సినిమా చేయడానికి వచ్చాడు సూర్య. కానీ ఇప్పుడు ఆ బాద్యత నుంచి సూర్య తప్పుకున్నాడు. ఇటివలే సుర్యకి నటుడిగా అవకాశాలు పెరిగాయి. అయితే మహేష్-మురగదాస్ సినిమాలో సూర్య కి విలన్ గా నటించే అవకాశాలు వచ్చాయి. నటుడిగా అవకాశాలు బాగా వస్తుండటంతో పవన్ సినిమానికి దర్శకత్వం చేయడం కష్టమే.

ఇదే విషయాన్ని పవన్ తో సూర్య చెప్పాడని తెలుస్తోంది. తన సినిమాకు డాలిని దర్శకుడిగా తీసుకుంటానని.. ఫ్యూచర్‌ లో ఎప్పుడైనా తన సినిమా నువ్వు దర్శకత్వం వహించొచ్చని.. ఇప్పుడు నువ్వు మహేశ్‌ సినిమాకే పనిచేయ్‌ అని పవన్‌ చెప్పినట్లు చెబుతున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. మహేశ్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది దాంతో ఒకే సారి మహేష్ సినిమాలో విలన్ గా ఇటు తన సినిమాకి దర్శకుడిగా చేయడం కష్టం కాబట్టి అలా చెయొద్దని సూర్యకు పవన్ హితబోధ చేసినట్లు సమాచారం. మొత్తానికి మహేష్ చిత్రం కోసం తన సినిమాను త్యాగం చేసాడు పవర్ స్టార్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -