Sunday, May 19, 2024
- Advertisement -

చిరంజీవి ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు!

- Advertisement -

చిరంజీవి రీ ఎంట్రీ కోసం మెగా ఫాన్స్ మాత్రమె కాక ప్రేక్షకులు కూడా విపరీతంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి లో ఇవాళ హైదారబాద్ లో ఈ సినిమా షూటింగ్ అట్టహాసం గా మొదలు అయ్యింది. స్క్రిప్ట్ పనులలో చాలా సమయం సరిపోయిన తరవాత చిరంజీవి తన నూట యాభయ్యవ సినిమా ఇవాళ మొదలు పెట్టారు. తమిళ నాట ఇండస్ట్రీ హిట్ గానిలిచిన కత్తి సినిమా ని రీమేక్ గా పెట్టి తీస్తున్న ఈ సినిమా కోసం చిరంజీవి ఇవాళ నుంచీ షూటింగ్ లో పాల్గొన్నారు.

కనీసం రెండు సంవత్సరాల పాటు సాగిన ఈ సినిమా విశేషాలు అదిగో ఇదిగో అంటూ గత నెలలో కొబ్బరి కాయ కొట్టారు. మొదట పూరీ జగన్నాథ్ అనుకున్నా తరవాత వినాయక్ మీదనే నమ్మకం పెట్టాడు చిరంజీవి. తన కొడుకు రాం చరణ్ ని నిర్మాతగా పరిచయం చేస్తూ కొణిదెల బ్యానర్ అనే సొంత బ్యానర్ పెట్టుకుని మరీ సినిమా తీస్తున్నారు చిరంజీవి. తనకి ఎప్పుడూ కలిసి వచ్చిన సెంటిమెంట్ టైపు లో ఫైట్ తో సినిమా షూటింగ్ ని మొదలు పెట్టారు డైరెక్టర్ వినాయక్.

చిరు షూటింగ్ సెట్స్ లో అలీ , అల్లూ అరవింద్ తదితరులు కనిపించారు. అనుష్క ఈ సినిమాలో చిరు సరసన నాటించ బోతోంది. ఈ సినిమా స్టిల్స్ ఇందాకే బయటకి రాగా అందులో చిరంజీవి ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ స్టైల్ ఆ మేనరిజం అదిరిపోయాయి అంటున్నారు అందరూ. ఒక ఫోటో లో అయితే చిరు ని చూసి షాక్ అయినట్టుగా ఆలీ పెట్టిన ఎక్స్ ప్రెషన్ చాలా బాగుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -