Sunday, May 5, 2024
- Advertisement -

చిరంజీవి 150 సినిమా కథ అదేనా..?!

- Advertisement -

మెగాస్టార్ 150 సినిమా రావడం ఖాయమైంది. ఈ సినిమాలకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించబోతున్న విషయం కూడా ధ్రువీకరణ అయ్యింది.ఇన్ని రోజులూ మిస్టరీగా ఉన్న ఈ విషయం పై ఇప్పుడు స్పష్టత వచ్చింది.

అసలు చిరంజీవి మళ్లీ సినిమాలు చేస్తాడా? చేయడా? అనే అంశం పై క్లారిటీ రావడంతో పాటు… ఇప్పుడు కథ గురించి కూడా వివరాలు వెలుగులోకి వస్తుండటం విశేషం!

లీకేజీ ప్రకారం చూస్తే..”ఆటో జానీ” అనబడు ఈ సినిమా లో చిరంజీవి డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. ఒకటి కాస్త వృద్ధుడి పాత్ర కాగా.. రెండోది యువకుడు అయిన ఆటోజానీ పాత్ర. కథప్రకారం యువకుడిగా కనిపించే చిరంజీవి బాధ్యతారాహిత్యంగా ఉంటాడు. పెద్దాయన పాత్ర మాత్రం స్వాతంత్ర పోరాటం నేఫథ్యం నుంచి తయారు చేసుకొన్నది. ఈ రెండు పాత్రల మధ్య కథ నడుస్తుంది.. చిన్న చిరంజీవిపని దారిలో పెట్టి.. అతడిని దేశసేవకు, దుష్టులపై పోరాడటానికి తీర్చిదిద్దడమే పెద్దాయన పని. ఇదే చిరంజీవి 150 వ సినిమా కథాంశమని తెలుస్తోంది.

ఈ సినిమాకు కథను బీవీఎస్ రవి అందిస్తుండగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ లీకులు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తున్నాయి. వీటికి సంబంధించిన షేరింగులే మెగాస్టార్ 150 సినిమా గురించి అభిమానుల్లో ఉన్న ఆసక్తికి దర్పణం పడుతున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -