Monday, May 13, 2024
- Advertisement -

సినిమాను అమ్ముకొనేందుకే సురేందర్ రెడ్డి అలాచెప్పాడా?!

- Advertisement -

రవితేజతో మరో సినిమా చేయడానికి సై అంటున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. కిక్ 2 ఆడియో విడుదల సందర్భంగా ఆయన ఈ మాట చెప్పాడు. ఇది వరకూ కిక్ సినిమాను తీసిన ఈ దర్శకుడే ఇప్పుడు కిక్ – 2 ను రూపొందించాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవితేజ ఓకే అంటే కిక్ సినిమాకు మూడో వెర్షన్ తీయడానికి రెడీ అని ప్రకటన చేశాడాయన.

అయితే టాలీవుడ్ లో ఇలాంటి ప్రకటనలు కొత్త కాదు. ఒక సినిమాకు కలిసి పనిచేస్తున్న వారు..ఆ సినిమా విడుదల సందర్భంగా ఇలాంటి ప్రకటనలు చేస్తుంటారు. ఈ హీరో ఓకే అంటే మరో సినిమాకు రెడీ అని.. ఈ దర్శకుడితోనే మరో సినిమా చేయడానికి సిద్ధమని హీరోలు, దర్శకులు ప్రకటించడం కొత్త కాదు. దాదాపుగా ప్రతి సినిమా ప్రచార సమయంలోనూ ఇలాంటి మాటలే వినిపిస్తూ ఉంటాయి.

తీరా ఆ సినిమా విడుదల అయ్యాకా ఇలాంటి వారు ఎవరికి వారు అవుతుంటారు. ఇలాంటి నేపథ్యంలో సురేందర్ రెడ్డిది కూడా అలాంటి ప్రకటనేనా అనేఅనుమానాలు రావడం సహజమే. కిక్- 2 సినిమా విడుదల నేపథ్యంలో ఈ సినిమా మూడో వెర్షన్ కు కూడా సిద్ధం.. రవితేజతో పనిచేయడం అంత ఉల్లాసన్ని ఇస్తుందని ఆయన చెప్పడం.. కిక్- 2 సినిమాపై పాజిటివ్ లుక్ కోసమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి అసలు సంగతి ఏమిటో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -