- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. అయితే తాజగా వచ్చిన సమాచరం మేరకు వచ్చే సంక్రాంతి కి అంటే జనవరి 2017 లో విడుదలకు సిద్దం చేస్తున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకి ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ చక్కని ట్యూన్స్ సిద్ధం చేశారట. ఈ చిత్రానికి రచన : పరుచూరి బ్రదర్స్ , కెమెరా: రత్నవేలు, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ , కళ: తోట తరణి, ఎడిటింగ్ : గౌతమ్ రాజు, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: వి.వి.వినాయక్.
Related
- ఖైదీ సినిమాలో నిహారిక ?
- మెగాస్టార్ ‘ఖైదీ నెంబర్ 150’ ఫస్ట్ లుక్
- నెపోలియన్ కాదు ఖైదీ నెం. 150!
- చిరంజీవి కోసం సాయి ధరం తేజ త్యాగం
- దేవీ శ్రీ ప్రసాద్ వెళ్ళిపోవడమే మంచిది అనుకుంటున్న బాలకృష్ణ అభిమానులు