Sunday, May 19, 2024
- Advertisement -

నెపోలియన్ కాదు ఖైదీ నెం. 150!

- Advertisement -

మెగా స్టార్ చిరు నటిస్తున్న 150వ చిత్రంపై రోజుకో వార్త వస్తోంది. ఇటివలే ఈ చిత్రంకు సంబంధించి మొదటి షేడ్యూల్ కంప్లీట్ అయ్యింది. కాకపోతే ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇక తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాని తెలుగులో చిరు తన 150వ చిత్రం గా రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమాకి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఈ చిత్ర టైటిల్ పై కొన్ని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాకి కత్తిలాంటోడు అనే టైటిల్ పెట్టినట్లు కొన్ని రూమార్స్ వచ్చాయి. తర్వాత ఈ చిత్రంకు టైటిల్ పెట్టాలేదు అని రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత ఖైదీ నెం. 150 అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అలాగే లేటేస్ట్ గా ఈ సినిమాకి నెపోలియన్ అనే టైటిల్ పెట్టినట్లు గుస గుస వినిపించాయి.

అయితే ఈ నెపోలియన్ పేరుతో దర్శకుడు అనంద్ రవి ముందుగానే ఫిల్మ్ ఛాంబర్ లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దాంతో చిరు సినిమాకి నెపోలియాన్ అనే టైటిల్ కాదు అని తెలిసిపోయింది. అయితే టాలీవుడు వర్గాల నుంచి అందుతున్న సమాచరం మేరకు.. ఈ సినిమాకి ఖైదీ నెం. 150 అని పెట్టే ఆలోచనలో ఉందట చిత్ర యూనిట్. ఎందుకంటే ఈ చిత్రంలో రెండు పాత్రలు ఉంటాయి. అందులో ఓ పాత్ర జైల్ లో ఉండే పాత్ర. ఇటివలే ఈ చిత్రం నుంచి లీక్ అయిన ఫోటోస్ లో కూడా చిరు చొక్క మీద 150 అనే ఉంటుంది. సో మొత్తానికి ఈ సినిమాకి ఖైదీ నెం. 150 అని పెట్టాలని చూస్తున్నారట. మరి ఈ టైటిల్ పై క్లారిటీ రావాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related

  1. చిరు సినిమా షూటింగ్ ఆగిందా?
  2. చిరుతో మెగా హీరోస్ అదిరిపోయే డాన్స్!
  3. చిరు సినిమాలో విజయశాంతి
  4. పూరిని మళ్లీ లైన్‍లో పెట్టిన చిరు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -