Tuesday, May 14, 2024
- Advertisement -

దేవీ శ్రీ ప్రసాద్ వెళ్ళిపోవడమే మంచిది అనుకుంటున్న బాలకృష్ణ అభిమానులు

- Advertisement -

తెలుగు లో టాప్ ఫార్మ్ లో ఉన్నాడు దేవీ శ్రీ ప్రసాద్ . బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా నుంచి దేవీ శ్రీ సడన్ గా తప్పుకున్న సంగతి తెలిసిందే. తెలుగు లో ఇప్పటి వరకూ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో రాజమౌళి తరవాత ఎవ్వరూ సినిమా తీయలేదు అలాంటి గౌతమీ పుత్ర శాతకర్ణి కి ఒక రేంజ్ లో మ్యూజిక్ కావాలి కాబట్టి దేవీ శ్రీ ప్రసాద్ తన రేంజ్ లో మ్యూజిక్ ఇస్తాడు అని అందరూ ఫిక్స్ అయ్యారు కానీ దేవీ మాత్రం ఇంకొకలగా చేసాడు.

ఇప్పటికే రెండు మూడు పెద్ద ప్రాజెక్ట్ లకి ఒకే సారి పని చేస్తూ ఉండడం , పైగా యూ ఎస్ లో లైవ్ షో లు ఒప్పుకోవడం తో ఈ సినిమా కి హ్యాండ్ ఇచ్చేసాడు. దేవిశ్రీ టాలెంటుని తక్కువ చేయడం కాదు కానీ.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు అతడి సంగీతం సూటవుతుందా అన్న సందేహాలు ముందు నుంచి ఉన్నాయి. దేవి మాస్ ఎంటర్టైనర్లకు తిరుగులేని మ్యూజిక్ ఇస్తాడు. క్లాస్ ప్రేమకథలకూ అతడి సంగీతం బాగానే సూటవుతుంది.

కానీ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే చిత్రాలకు మాత్రం అతను ఇన్నేళ్లుగా ఇస్తున్న మ్యూజిక్ యాప్ట్ కాదేమో. అసలు ఇప్పటిదాకా అతను ఈ తరహా చిత్రాలకు పని చేసింది లేదు. ‘పులి’ లాంటి జానపద చిత్రానికి మ్యూజిక్ ఇచ్చాడు కానీ.. రెస్పాన్స్ అంత గొప్పగా ఏమీ లేదు. అతడి పాటలు.. బ్యాగ్రౌండ్ స్కోర్ మోడర్న్ గా ఉన్నాయని.. ఆ సినిమాకు అంతగా నప్పలేదని ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలోనూ దేవి ఎలాంటి ఔట్ పుట్ ఇస్తాడో అన్న సందేహాలు కొంత వరకు ఉన్నాయి. ‘కంచె’కు సోల్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చి ఆ సినిమాకు ప్రాణం పోసిన చిరంతన్ భట్ అయితే ‘గౌతమీపుత్ర..’కు బాగానే సెట్టయ్యే అవకాశముంది.

Related

  1. బాలకృష్ణ కొడుకు ఫస్ట్ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్
  2. బాలకృష్ణ కి భయపడిన ఎన్టీఆర్ ?
  3. ఎన్టీఆర్ కి రాజమౌళి షాక్!
  4. అనుష్క కి రాజమౌళి వార్నింగ్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -