Wednesday, May 1, 2024
- Advertisement -

దొరబాబుగా మారిన చిరంజీవి!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమాను బింబిసార దర్శకుడు వశిష్టతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్‌ని ఖరారు చేయగా ఇదో భిన్నమైన అడ్వెంచర్ ఫాంటసీ మూవీ.ఇక ఈ సినిమాలో చిరు క్యారెక్టర్‌కు సంబంధించిన న్యూస్ టీ టౌన్‌లో వైరల్‌గా మారింది.

చిరు క్యారెక్టర్‌కు దొరబాబు అనే పేరు ఖరారు చేశారు. భీమవరం నేపథ్యంలో ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తోండగా చిరు లుక్ డిఫరెంట్‌గా ఉండనుందట. గోదావరి యాసలో చిరు క్యారెక్టర్ పాత్ర ఉండనుండగా కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉంటుందట.

గతంలో చిరు…ఫాంటసీ చిత్రాలు జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి చిత్రాలు చేశారు. ఈ రెండు సినిమాలకు మించి విశ్వంభర ఉండనుంది. ఫిబ్రవరి 1 నుండి విశ్వంభర షూటింగ్ ప్రారంభం కానుంది. సుమారు రెండు వారాలు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు చిరు. 2025 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ నిర్మిస్తోండగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -