Monday, April 29, 2024
- Advertisement -

ఆ సీరియల్ నటి..విలన్ ఒక్కటయ్యారు!

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలోని నటీనటులు పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. తాజాగా అలాంటి జంటే ఒక్కటయ్యారు. సీరియల్ నటి గోపిక అనిల్‌ని వివాహం చేసుకున్నారు నటుడు పద్మ సూర్య. తెలుగు సినిమాల్లో విలన్‌గా నటించారు సూర్య. కేరళ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. కేరళ వడక్కునాథన్ ఆలయంలో వీరి పెళ్లి జరుగగా ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

సూర్య…డాడీ కూల్, 72 మోడల్, ప్రేతమ్, ప్రేతమ్ 2 సినిమాల్లో నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురం సినిమాలో విలన్ కొడుకుగా నటించాడు సూర్య. అలాగే బంగార్రాజు, మీట్ క్యూట్, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ సినిమాల్లో విలన్ రోల్స్ చేశారు.

గతేడాది అక్టోబర్‌లో సూర్య – గోపికల ఎంగేజ్‌మెంట్ జరిగింది. వీరిద్దరిది పెద్దలు కుదర్చిన వివాహాం కాగా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -