Sunday, May 5, 2024
- Advertisement -

చిరు గెడ్డం తీసిందెందుకు?

- Advertisement -

ఇటీవ‌ల వ‌చ్చిన వార్త‌ల్లో చిరంజీవి సైరా మొద‌టి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా గురించి వ‌చ్చిన గాసిప్‌లు మ‌రే సినిమాకు రాలేద‌నే చేప్పాలి.చిరంజీవి ఏం చేసిన సంచ‌ల‌న‌మే.ఆయన గెడ్డం పెంచినా వార్తే. తీసినా వార్తే. సైరా సినిమా గెటప్ కోసం చిరంజీవి గెడ్డం పెంచిన సంగతి తెలిసిందే. సినిమా మొద‌టి ష్యెడ్యులు కూడా పూర్తి చేసుకుంది.

అయితే ఈ సినిమా గురించి మ‌రో వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి వర్క్ తో చిరంజీవి సంతృప్తి గా లేరని, డైర‌క్టర్‌ని మార్చ‌ల‌ని మ‌రో ద‌ర్శ‌కుడిని తీసుకోవాల‌ని చిరు ఆలోచిస్తున్న‌ట్లు ఇలా ర‌కార‌కాలుగా వార్త‌లు వ‌చ్చేస్తున్నాయి.అయితే అవన్నీ వట్టిదే అని, ఫిబ్రవరి నుంచి తరువాతి షెడ్యూలు వుంటుందని సైరా యూనిట్ ప్రకటించింది.

న్యూ ఇయర్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి క్లీన్ షేవ్ తో చకచకా గెడ్డం తీసిన లుక్ తో కనిపించారు. దాంతో మళ్లీ గ్యాసిప్ లు ఊపందుకున్నాయి. క్యారెక్టర్ కంటిన్యూనిటీ వుండాలంటే గెడ్డం వుండాలి కదా? మరి ఎందుకు తీసేసినట్లు? మళ్లీ పెరగడానికి చాలా టైమ్ పడుతుంది కదా? మరి ఫిబ్రవరి నుంచి సైరా షెడ్యూలు వుండదా? లేదా టెస్ట్ ఫుటేజ్ చూసుకున్నాక, చిరంజీవి సైరాలో గెటప్ ఏమన్నా మారుస్తున్నారా? ఇలా రకరకాల క్వశ్చన్లు.చూద్దాం చిత్ర యూనిట్ దీనిపై ఏలా స్పందిస్తందో.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -