Saturday, May 18, 2024
- Advertisement -

2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగు రాష్ట్రాల్లో బ‌యోపిక్ చిత్రాల హ‌వా…

- Advertisement -

నిమాల్లో జీవిత‌క‌థ‌లకు మంచి డిమాండ్ ఉంది. హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్… ఇలా ఏ సినీప‌రిశ్ర‌మ‌లోనైనా బ‌యోపిక్‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ బ‌యోపిక్ రానుండ‌గా దానికి పోటీగా ఇప్పుడు ఇదే బాట‌లో మ‌రో నాయ‌కుడు వైఎస్ఆర్ బ‌యోపిక్ రానుంది.

ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా బాలకృష్ణ హీరోగా తేజ డైరెక్స‌న్‌లో సినిమా రూపొందుతోంది. దానికి పోటీ అన్నట్లుగా వైయస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవునన్నా కాదన్నా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను వచ్చే ఎన్నికల్లో వాడుకుంటారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తనకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ నిర్మాణానికి అంగీకించినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్‌కు రాజకీయాల్లో వైఎస్ పోటీ.. ఎన్టీఆర్ వారసత్వాన్ని చంద్రబాబు నాయుడు వాడుకుంటూ వస్తున్నారు. అదే రీతిలో వైయస్ రాజశేఖర రెడ్డిని వైయస్ జగన్ వాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారిద్దరికీ చాలా కాలంగా పోటీ పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి నేతల బయోపిక్‌లను చూడాల్సి ఉంటుంది.

వైఎస్ పాత్రలో మమ్ముట్టి వైఎస్ బయోపిక్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఆనందో బ్రహ్మ’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి. రాఘవ్‌ వైఎస్సార్‌ బయోపిక్‌కు దర్శకత్వం వహిస్తారని సమాచారం. దానికి వైఎస్సార్‌ కుమారుడు, వైసిపి అధినేత జగన్‌ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పేర ఎన్టీ రామారావు బయోపిక్‌ తీయడానికి సిద్ధపడ్డారు. దానికి పోటీగా లక్ష్మీస్ వీరగంధం సినిమాను తీస్తానని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించారు. ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో అన్నీ బ‌యోపిక్ చిత్రాలే రానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -