Tuesday, April 30, 2024
- Advertisement -

బాలయ్య vs చిరు : బిగ్ ఫైట్ కు ససేమిరా అంటున్న బడా బ్యానర్ ?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మద్య ఎప్పుడు కూడా రసవత్తరమైన పోరు ఉంటుంది. 1990’s లో వీరిద్దరి మద్య పోరు ఏ స్థాయిలో ఉండేదో తెలుగు సినీ ప్రేక్షకులు అంతా తేలికగా మర్చిపోలేరు.ముఖ్యంగా వీరిద్దరి సినిమాలు వస్తున్నాయంటే ఈ ఇద్దరి హీరోల అభిమానులు చేసే హంగామా అంతా ఇంత కాదు. అలాంటిది చిరు బాలయ్య ఒకేసారి బాక్సాఫీస్ వద్ద వార్ కు దిగితే.. ఆ ఫైట్ ఎలా ఉంటుందో ఇప్పటికే చాలాసార్లు చూశాం. ఎవరు పైచేయి సాధిస్తారనే విషయం పక్కన పెడితే.. ఈ ఇద్దరి హీరోల అభిమానులు చేసే హంగామా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. .

ఇక ఇప్పటికే ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ చిరు బాలయ్య మరోసారి పోటీకి సై అనబోతున్నారా అంటే అవుననే వార్తలు అమద్య బలంగా వినిపించాయి. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ” వాల్తేరు వీరయ్య ” వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్నట్లు చిత్రయూనిట్ గతంలోనే ప్రకటించింది. ఇక గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ” #NBK107 ” మూవీ కూడా సంక్రాంతికే రాబోతున్నట్లు గతంలో వార్తలు వినీపించాయి. అయితే ఈ రెండు చిత్రాలు కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతుండడం గమనార్హం. దీంతో ఒకే నిర్మాణ సంస్థ రెండు భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతుందా ? అంటే చెప్పడం కష్టమే. అందుకే బాలయ్య చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేసి.. చిరు మూవీని సంక్రాంతి రేస్ లో నిలపాలని నిర్మాణ సంస్థ భావిస్తోందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -