Monday, April 29, 2024
- Advertisement -

ఉత్తరాంధ్రలో హై టెంక్షన్ .. పాలిటిక్స్ !

- Advertisement -

ప్రస్తుతం ఏపీలో ఉత్తరాంధ్ర చుట్టూ రాజకీయ వేడి రగులుకుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఉత్తరాంధ్రలో ఇప్పుడు హై టెంక్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే.. ఒకవైపు అధికార పార్టీ గర్జన సభలు మరోవైపు అమరవైతి రైతుల పాదయాత్రలు ఇంకోవైపు జనసేనాని జనవాణి కార్యక్రమాలు.. ఇలా ప్రధాన పార్టీలకు సంబంధించిన కార్యాచరణ ఏకకాలంలో ఒకేసారి ఒకేసారి అమలు కావడంతో అసలు ఉత్తరాంధ్రలో ఏం జరుగుతోందని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. రాష్ట్రనికి ఒకే రాజధాని ఉండాలని మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ కమిటీ ఆద్వర్యంలో రైతులు చేస్తున్న పాదయాత్ర ఈ నెల 15 తేదీన ఉత్తరాంధ్ర సరిహద్దు జిల్లాల్లో ప్రవేశించనుంది.

ఈ నేపథ్యంలో ఊహించని విధంగా అధికార వైసీపీ పార్టీ విశాఖ గర్జన పేరుతో వికేంద్రీకరణకు మద్దతుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ర్యాలీ చేపట్టనున్నారు. అయితే వైసీపీ చేస్తున్న ఈ గర్జన సభ అమరావతి రైతుల పాదయాత్ర అడ్డుకోవడానే అనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక విశాఖగర్జనను జయప్రదం చేసేందుకు వైసీపీ మంత్రులు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. గర్జనపై మంత్రులు గుడివడ అమర్నాథ్, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ వంటి వారు పదే పదే ప్రస్తావిస్తున్నారు. అటు అమరావతి రైతులు, ఇటు వైసీపీ గర్జనతో ఒక్కసారిగా హీటెక్కిన ఉత్తరాంధ్ర రాజకీయం జనసేనాని ఎంట్రీ తో తారస్థాయికి చేరుకుంది.

వైసీపీ నిర్వహిస్తున్న గర్జనపై ” ఎవరికోసం ఈ గర్జన.. ” అంటూ పవన్ వేస్తున్న సెటైర్లకు వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక ఊహించని విధంగా ఉత్తరాంధ్ర పర్యటనకు పవన్ షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 15,16,17 మూడు రోజులు జనసేనాని ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఇది వైసీపీ నేతలకు ఏమాత్రం మింగుడుపడని విషయమనే చెప్పాలి. ఎందుకంటే 15న వైసీపీ నేతలు నిర్వహించే గర్జనకు పవన్ పర్యటనతో స్ట్రోక్ గట్టిగానే తగలనుంది. ఇక 16న విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తరువాత పార్టీకి చెందిన నేతలతో భేటీ అవుతారు పవన్. అయితే పవన్ పర్యటన చంద్రబాబు ప్లానే అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఉత్తరాంధ్ర రాజకీయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -