Saturday, May 4, 2024
- Advertisement -

జగన్, బాబు కక్ష్య రాజకీయాలు.. ప్రజలకు తప్పని తిప్పలు !

- Advertisement -

సాధారణంగా ప్రభుత్వ ప్రతిపక్షా పార్టీల మద్య జరిగే విభేదాలు, వివాదాలు, విమర్శలు సర్వసాధారణమే. కానీ ఏపీలో ప్రధాన పార్టీల మద్య ఉండే విభేదాలు ఎప్పుడు కూడా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా టీడీపీ వైసీపీ మద్య జరిగే రాజకీయ ఘర్షణలు దేశ ప్రజలు అసహ్యించుకునే విధంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ విమర్శలు మొదలుకొని వ్యక్తిగత ధూషణల వరకు ఈ రెండు పార్టీ నేతలు మద్య రాజకీయ వైరం గురించి అందరికీ తేలిసిందే. ముఖ్యంగా వైసీపీ అధికరంలోకి వచ్చిన తరువాత టీడీపీ హయాంలో ప్రవేశ పెట్టిన చాలా వాటిని వైఎస్ జగన్ పూర్తిగా మార్చేశారు.

పథకాల పేర్లు మార్చడం సర్వసాధారణమే కానీ గత ప్రభుత్వం కట్టించిన బిల్డింగ్ లు మొదలుకొని ఏకంగా రాజధానినే మార్చేంతలా సి‌ఎం జగన్ చర్యలు తీసుకోవడం ఆయన కక్ష్య రాజకీయాలకు నిదర్శనం అని టీడీపీ శ్రేణుల వాదన. జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొత్తలో చంద్రబాబు కట్టించిన ప్రజావేధికను కూల్చడం అప్పుడు ఏ స్థాయిలో చర్చనీయాంశం అయిందో అందరికీ తెలిసిందే. ఇక రాష్ట్రనికి రాజధానిగా అమరావతిని కేటాయించారు చంద్రబాబు. అయితే దేశ చరిత్రలోనే ఎవరు ఊహించని విధంగా రాజధాని మార్పుకు శ్రీకారం చుట్టి మూడు రాజధానుల ప్రస్తావనను తెరపైకి తెచ్చారు వైఎస్ జగన్.

ఇక ఇదే సంచలనం అనుకుంటే దీన్ని మించిన సంచలనంగా స్వర్గీయ ఎన్.టి రామారావు పేరు మీద ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కూడా మార్చి తన వైఖరి విధానం ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేశారు వైఎస్ జగన్. అయితే ఇలా స్థిరంగా కొనసాగాల్సిన వాటిని మార్చుకుంటూ పోతే ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను వైఎస్ జగన్ ఎందుకు ఖాతరు చేయడం లేదనే విమర్శలు ఎదురవుతున్నాయి. రాజధాని మార్పుతో అమరవతికి భూములిచ్చిన రైతుల ఆవేదన, అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతో విధ్యార్థులు ఎదుర్కొనే చిక్కులు ఇవన్నీ జగన్ కు కనిపించడం లేదా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. జగన్ కేవలం చంద్రబాబుపై కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే వాదన బలంగా పెరుగుతోంది. ఇదిలా ఉంచితే జగన్ ఏవైతే మార్చరో తాము అధికారంలోకి వస్తే మళ్ళీ మరుస్తామని టీడీపీ శ్రేణులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -