Thursday, May 2, 2024
- Advertisement -

చిరంజీవి.. ఫ్యూచర్ ప్లాన్ పై అక్కడ క్లారిటీ ఇచ్చేస్తారా..?!

- Advertisement -

సినిమాలా.. రాజకీయమా? 150 సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీతోనే కలిసి ప్రయాణం చేయడమా… లేక రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ.. భవిష్యత్తులో మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల రణరంగంలోకి దిగేదా?! అనేవి మెగాస్టార్ చిరంజీవి  విషయంలో అభిమానుల్లో నెలకొన్న ఆసక్తికరమైన విషయాలు.

వీటి గురించి క్లారిటీ వచ్చే సమయం ఆసన్నమైనట్టుగానే ఉంది…  స్వయంగా మెగాస్టార్ ఈ అంశాల గురించి వివరణ ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉంది!

ఆగస్టు 22.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఏడాది ఆయన పుట్టిన రోజును గ్రాండ్ గా నిర్వహించడానికి సిద్ధం అయ్యారు అభిమానులు. ఏకంగా వారం రోజుల పాటు చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను జరపడానికి వారు సిద్దం అయ్యారు. ఆగస్టు 15 వ తేదీ నుంచి 22 వరకూ హైదరాబాద్ లోనే ఈ వేడుకలను జరపనున్నారు. ఈ కార్యక్రమాల్లోభాగంగా..
సానియా, సైనా, రాయుడు వంటి వాళ్లకు సన్మానం కూడా చేయనున్నారట.

మరి 22 వ తేదీన చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరై .. వారిని సన్మానించే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో మెగాస్టార్ ఆ రోజున చేయబోయే ప్రసంగం కూడా ఆసక్తికరమైనదే. ఆ రోజున చేయబోయే ప్రసంగంలో చిరంజీవి వివిధ అంశాల గురించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. తను సినిమాలతోనే కొనసాగుతానా?! రాజకీయాలను పక్కనపెడతానా? అనే అంశాల గురించి చిరంజీవి తప్పక మాట్లాడతారు. ఆ మాటల కోసమే ఇప్పుడు అభిమానులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -