Friday, May 10, 2024
- Advertisement -

కథ ఒకటే, సినిమాలు పది, హీరోలూ పది, ఆ రచయిత అంతే

- Advertisement -

కథ ఒకటే, సినిమాలు పది, హీరోలూ పది, ఆ రచయిత అంతే

మామూలుగా అయితే మన సినిమా ప్రపంచంలో జరుగుతున్నది ఇదే అయినా.. ఈ రచయిత గారి స్టైలే వేరు.. అతని దగ్గర ఉన్న ఒక కథని చిన్న చిన్న మార్పులతో రెడీ చేసి, ప్రొడ్యూసర్ కి మాటలు చెప్పి తన జేబును నింపుకుంటున్నాడు..

అలా అలా సినిమాలు ఆడటంతో అతను ఇండస్ట్రీకి బాగా లక్కున్న రచయితగా అయ్యాడు.. ఇండస్ట్రీలో బాగా లక్ ప్లస్ ట్యాలెంట్ ఉన్న ప్రొడ్యూసర్ కూడా రచయిత రెడీ చేసిన పాత కథ లోనే సినిమా తీస్తున్నారట.. ఇండస్ట్రీలో up coming ట్యాలెంటెడ్ person ని వలేసి పట్టుకుంటూ వారికి అవకాశాలు రావడానికి తన వంతు సాయం చేసినట్టే చేస్తూ వారి సక్సెస్ తో వాటాలు, రెమ్యూనరేషన్‌లో కూడా వాటాలు తీసుకుంటున్నాడు..

ఇలా ఈ మధ్య ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సినిమా డైరెక్టర్ ని తన శిష్యుడిగా ప్రచారం చేసుకొనగా సదరు డైరెక్టర్ tweets ద్వారా “నాకు ఎవరు గురువులు లేరు, నేను ఎవ్వరికి శిష్యుడిని కాను” అని ఘాటుగా స్పందించారు. ఈ రచయిత పని చేసున్న under production చిత్రాల దర్శకుల నిర్మాతల కు ఈయన రచన చేయగా రిలీజ్ అయిన చిత్రాలకు ఉదయం ఆటకే చాలా టెన్షన్ గా పరుగెత్తాల్సిన పరిస్థితి.. ఎందుకంటే ఒకటే సన్నివేశాన్ని పది సినిమాల్లో పది సందర్బాల్లో వాడతాడు కాబట్టి.. చిత్ర కథా బృందం create చేసిన మంచి సన్నివేశాలను తనవిగా ప్రొడ్యూసర్ గారికి ముందుగా చెప్పి తనవే అనే లాగా మార్కులు కొట్టేస్తాడట..

ఈయన గారు supervise చేసిన సినిమా హిట్ అవ్వడంతో సినిమా రిలీజ్ అయి హిట్ అయిన తర్వాత తాను పనిచేస్తున్న ప్రాజెక్టుల చీఫ్ టెక్నీషియన్స్ అందరితో ఆ డైరెక్టర్ వేస్ట్ అని ఆ సక్సెస్ క్రెడిత్ మొత్తం తనదేనని చెప్పుకుంటున్నాడు. కానీ అదే సినిమా ఫ్లాప్ అయింటే అలా చెప్పుకునేవాడు కాదేమో. ఇప్పుడు కూడా తన పర్యవేక్షణలో ఇంకో సినిమా జరుతుంది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత ఎవరిదో ముందే చెప్పుకునే దమ్ముందా.. ఇది కథలు కథలుగా కృష్ణానగర్ లో చెప్పుకుంటున్నారు ఆ రచయిత కథ.. కమీషా గురించి.. ఇతను కథ, రచయిత కన్నా మర్కెటింగ్ తెలివితేటలు బాగా కలిగిన వ్యక్తి.. ఇంతకీ ఆ రచయిత ఎవరో just think…       

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -