Thursday, May 16, 2024
- Advertisement -

ఏపీలో టీడీపీ పాపాలకు ఫలితం తెలంగాణలో?!

- Advertisement -

ఏపీలో అధికారంలో ఉంది.. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉంది తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ విభజనతో .. రెండుగా చీలడంతో తెలుగుదేశానికి ఒక చోట రాజయోగం లభించగా.. మరో చోట ప్రతిపక్షంలో కూర్చొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్షంలో కూర్చొన్న  చోట తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులు పడుతోంది. తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు పచ్చ చొక్కాల నేతలు.

తాజాగా తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తమపై కేసీఆర్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని అంటున్నాడు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులను కేటాయించడం లేదని.. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోందని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నిధులను కేటాయిస్తూ ప్రతిపక్షమైన తమ పట్ల మాత్రం నిర్లక్ష్యం చూపుతోందని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశాడు.

మరి ఎర్రబెల్లి మాటల్లో కూడా నిజం ఉండవచ్చు. అయితే ఇదే సమయంలో ఏపీ వ్యవహారాల గురించి కూడా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఇలాంటి కక్ష సాధింపు చర్యలనే చేపడుతోంది. అక్కడ బాబు ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. వారికి నిధుల కేటాయింపు చేయడం లేదు. మొత్తం నిధులను తనదగ్గరే పెట్టుకొని.. తనకు ఇష్టమైన వారికి మాత్రమే కేటాయింపులు చేస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

ఇలా ఉంది వ్యవహారం. ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాల వాళ్లను ఏడిపిస్తోంటే.. తెలంగాణలో ఆ పార్టీనే ప్రతిపక్షంగా ఏడుస్తోంది. చెల్లుకు చెల్లు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -