Wednesday, May 15, 2024
- Advertisement -

యంగ్‌గా క‌నిపించేందుకు మెగాస్టార్‌కు చికిత్స‌

- Advertisement -

‘సైరా’ కోసం చిరంజీవి కొత్త లుక్‌లో

త‌న 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి‘సైరా’ కోసం చిరంజీవి తీవ్రంగా క‌ష్ట ప‌డుతున్నారు. ఈ సినిమాను అంత‌ర్జాతీయ సినిమాగా రూపొందించేందుకు కుమారుడు, న‌టుడు నిర్మాతగా మారి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దీనికోసం ప్ర‌త్యేకంగా ప‌లు కార్య‌క్ర‌మాలు, సెట్టింగ్స్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో చిరంజీవి యంగ్‌గా క‌నిపించేందుకు చికిత్స చేసుకోనున్నార‌ట‌. ఇప్పుడు కొంచెం బొద్దుగా ఉండ‌డంతో సినిమాలో సైరా పాత్ర కోసం స‌న్న‌బ‌డి యంగ్ లుక్‌లో క‌నిపించేందుకు చిరంజీవి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు చిరంజీవి ఆయుర్వేద చికిత్స కూడా తీసుకోబోతున్నాడట.

యంగ్ ఉయ్యాలవాడగా కనిపించేందుకు చిరంజీవి విశాఖ‌ప‌ట్ట‌ణానికి వెళుతున్నాడు. చర్మంలో మెరుపును పెంచి వయసును కాస్త తగ్గించే విధంగా ఆయుర్వేద చికిత్స అందిస్తారట. కొన్నిరోజుల పాటూ వైజాగ్‌లోనే ఉండి.. ఆ చికిత్స పూర్తిచేసుకుని తిరిగి షూటింగ్‌లో చిరు పాల్గొనే అవ‌కాశం ఉంది. కాస్త వయసు తగ్గినట్టు కనిపిస్తే అతడిపై ఉయ్యాలవాడ యువకుడిగా ఉన్నప్పటి సన్నివేశాలు తీయ‌నున్నారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -