- Advertisement -

గ‌జ‌రాజుల మ‌ధ్య భ‌ళ్లాలుడి సినిమా

- Advertisement -

దున్న‌పోతు త‌ర్వాత ఏనుగుల‌తో రానా

తెలుగుతో పాటు హిందీ – తమిళ సినిమాల్లో ప్ర‌స్తుతం ద‌గ్గుబాటి రానా బిజీ అయ్యాడు. కొత్త త‌ర‌హా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డే త‌త్వం రానా అల‌వ‌ర్చుకున్నాడు. ఇప్పుడు జాతీయ స్థాయిలో బాహుబ‌లి సినిమాల‌తో పేరుపొందాడు. ఇప్పుడు త‌ను ఏ సినిమా చేస్తాడో అని ప్రేక్ష‌కులు, అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు కొత్త త‌ర‌హా సినిమా చేస్తున్నాడు. ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న భ‌ళ్లాల‌దేవుడు ఓ సాహసం చేస్తున్నాడు. బాహుబ‌లిలో ఓ దున్న‌పోతుతో త‌ల‌ప‌డిన రానా ఇప్పుడు ఏనుగుల‌తో స్నేహాం చేయ‌నున్నారు. ఏనుగుల‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం ఉంది. కథలో వైవిధ్యం ఉంటే వెంట‌నే ఒప్పేసుకునే రానా త‌ర్వాతి సినిమా హిందీలో చేస్తున్నాడు. హాతీ మేరే సాతి అనే సినిమా ప్ర‌స్తుతం చేస్తున్నాడు. సినిమా పేరులోనే ఏనుగే నా తోడు అని అర్థం.

అడవిలో ఏనుగుల మధ్య ఈ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. ఈ సినిమా కోసం ఏనుగులతో రానా స్నేహం చేయబోతున్నాడు. త్వరలో థాయిలాండ్ అడవుల్లో షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమా కోసం రానా ఓ రెండు వారాల పాటు ప్రత్యేక ట్రైనర్ల సహాయంతో ఒంటరిగా ఏనుగులతో స్నేహం చేసేందుకు రానా సిద్ధపడుతున్నాడు.హాతీ మేరే సాథీ సినిమా 1971లో రాజేశ్ ఖన్నా హీరోగా హిందిలో బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. ఆ సినిమా రీమేక్‌ను తీస్తున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా రానుంది. తెలుగు వెర్షన్‌లో అడవి రాముడు అనే పేరు పరిశీలిస్తున్నారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -