Sunday, May 12, 2024
- Advertisement -

రోమాలు నిక్క‌పొడుచుకొనేలా మెగాలుక్‌..

- Advertisement -

తెలుగు చలన చిత్ర రంగంలో రారాజు గా వెలిగిపోయిన మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత తిరిగి వెండి తెరపై కనిపించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి రిమేక్ గా మాస్ దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో నటించారు.

ఇక చిరంజీవి 151 చిత్రం సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న సినిమాపై అభిమానుల్లో ఎలాంటి అంచ‌నాలున్నాయె తెలిసిందే. ఉయ్యలవాడ నరసిం హారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ కథను పరుచూరి సోదరులు అందించడం జరిగింది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ హింది భాషల్లో నిర్మించబడుతుంది. 150 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా టైటిల్ విషయంలో రకరకాల టాపిక్ లు నడిచాయి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందుతున్న ఈ సినిమాకు సై రా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెర మీదకు వచ్చింది. రాయలసీమ ప్రాంతంలో ఉయ్యాలవాడ సాహసాలను కీర్తిస్తూ పాడుకునే ‘సై రా నరసింహారెడ్డి’ అనే పదాలనే సినిమా టైటిల్ గా నిర్ణయించారట. మొత్తానికి ఆకట్టుకునే టైటిల్ అనే చెప్పొచ్చు.

ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, సీనియర్ హీరో జగపతి బాబు, సాండల్ వుడ్ స్టార్ సుధీప్, కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా లేడీ సూపర్ స్టార్ నయనతార చిరుకు జోడిగా నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -