Wednesday, May 15, 2024
- Advertisement -

ముస్లింల ఓట్లు భాజాపాకు అంద‌ని ద్రాక్ష అన్న‌దాన్ని తుడిచేసిన మోదీ

- Advertisement -

దేశంలో భాజాపా అంటేనే ముస్లింల వ్య‌తిరేక పార్టీ. అనాదిగా ముస్లింల ఓటు బ్యాంక్ భాజాపాకు అంద‌ని ద్రాక్ష‌లాగె ఉండిపోయింది. కాని న‌రేంద్ర మోదీ ప్ర‌ధాని అయిన త‌ర్వాత నిదానంగా దాన్ని చెరిపేస్తున్నారు. ముస్లింల మ‌న‌సు గెలుచుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌య‌త్నాల్లో కొంత వ‌ర‌కు విజ‌యం సాధించిన‌ట్లే.

ట్రిపుల్‌ త‌లాక్ అనే దానిమీద దేశంలో చ‌ర్చ‌జ‌రుగుతోంది. దీని వ‌ల్ల ముస్లిం మ‌హిళ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని గ‌త కొంత‌కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇస్లామిక్‌ దేశాల్లో సైతం ‘ట్రిపుల్‌ తలాక్‌’పై నిషేధం వున్నా, మన దేశంలో మాత్రం ‘ట్రిపుల్‌ తలాక్‌’ అనేది మత విశ్వాసంలా చెలామణీలో వుంది.

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, చాలా తేలిగ్గా ‘ట్రిపుల్‌ తలాక్‌’ చెప్పేసి, ముస్లిం సమాజంలో భర్తలు, భార్యలకు విడాకులు ఇచ్చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, సర్వోన్నత న్యాయస్థానం ‘ట్రిపుల్‌ తలాక్‌’ చెల్లదని తేల్చేసింది. అయితే, ఆరు నెలలపాటు తమ తీర్పు అమల్లో వుంటుందనీ, ఈలోగా కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌పై చట్టం చెయ్యాలని ఆదేశించింది

కేంద్రం, ట్రిపుల్‌ తలాక్‌కి వ్యతిరేకమని చెప్పడంతో కేసు విచారణలో కీలకమైన ముందడుగు పడింది. ఇప్పుడిక, పార్లమెంటులో ట్రిపుల్‌ తలాక్‌కి వ్యతిరేకంగా చట్టం జరగనుండడమే తరువాయి. రెండు స‌భ‌ల్లోను భాజాపాకు మెజారిటి ఉంది కాబ‌ట్టి చ‌ట్ట‌తేలిక‌న‌గా ఆమోదం పొందుతుంది.

ట్రిపుల్‌ తలాక్‌పై సర్వోన్నత న్యాయస్థానం తీర్పుని ముస్లిం మహిళా సమాజం స్వాగతిస్తోంది. కొంతమంది మత పెద్దలు సైతం, తలాక్‌ విషయంలో సుప్రీం తీర్పుతో ఏకీభవిస్తోంటే కొంతమంది మాత్రం, ఇది తమ హక్కులకు భంగం కలిగించే చర్య.. అని అభివర్ణిస్తుండడం గమనార్హం.

సుప్రీంకోర్టు తీర్పుతో ప్ర‌ధాని మోదీ ముస్లింల మ‌న‌సు కొంత వ‌ర‌కు గెలుచుకున్న‌ట్లే. త‌మ పార్టీ ముస్లింల‌కు వ్య‌తిరేకం కాదు అనేదానికి కొంత కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. తమ జీవితాల్లో వెలుగు తెచ్చేలా ట్రిపుల్‌ తలాక్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం వుందనీ, ఈ విషయంలో మోడీ సర్కార్‌ తమకు అండగా నిలవడం ఆనందంగా వుందని ముస్లిం మహిళలు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -