Thursday, May 2, 2024
- Advertisement -

సంచలన నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్…

- Advertisement -

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పేద ప్రజలకు తీపి కబురు అందించింది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడిన వారికి ఉచితంగా కరెంట్ అందిస్తామని ప్రకటించారు. అలాగె 200 నుంచి 400 యూనిట్లు విద్యుత్ వాడితే వారికి కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని సీఎం కేజ్రీ వాల్ తెలిపారు.

దేశం మొత్తంలోనే అత్యంత చౌకగా విద్యుత్ లభిస్తున్న రాష్ట్రం ఢిల్లీయేనని అన్నారు. ఉచిత విద్యుత్ నిర్ణయం చారిత్రాత్మకమని, సామాన్యుడికి ఎంతో ఊరటను కలిగిస్తుందని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని వీఐపీలు, పెద్ద పెద్ద రాజకీయనాయకులు ఉచితంగా విద్యుత్ ను వాడుకుంటున్నారని, ఇదే సమయంలో సామాన్యుల నుంచి విద్యుత్ బిల్లులను వసూలు చేయకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -