- Advertisement -
మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. నరేష్ ప్యానల్, శివాజీ రాజీ ప్యాన్‌ల్‌ల మధ్య బలమైన పోటీ నెలకొంది. ఓటు వేయడానికి నటులందరూ వస్తుండటంతో హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు వచ్చి ఓటు వేయగా, కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇద్దరూ ఒకే కారులో రావడం ఆశ్చర్యం.