Monday, June 17, 2024
- Advertisement -

మెగా సాయం..చిరుపై ప్రశంసలు

- Advertisement -

కష్టాల్లో ఉన్నానని తెలిస్తే చాలు సాయం చేసేందుకు ముందుకు వచ్చే వారిలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి. సినిమా ఇండస్ట్రీలోనే తన అభిమానులకు, పలువురు జర్నలిస్టులకు సాయం చేయడంలో ముందుంటారు చిరు.

తాజాగా ఓ సీనియర్ సినిమా జర్నలిస్ట్‌కు అండగా నిలిచి తనలోని మంచి తనాన్ని బయటపెట్టారు. సినిమా జర్నలిస్ట్ ప్రభు ఇటీవల మెడికల్ టెస్టులు చేయించుకోగా హార్ట్ లో 80% బ్లాకులు ఉన్నట్టు చెప్పారు. యాంజియో గ్రామ్ చేసి బైపాస్ సర్జరీ చేయాలి అని చెప్పగా చిరంజీవిని ఆశ్రయించారు ప్రభు.

దీంతో చిరంజీవి హైదరాబాద్ స్టార్ హాస్పటల్ డాక్టర్స్ కు ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేయించి ప్రభుని అడ్మిట్ చేయించారు. బైపాస్ చేయాల్సిన పని లేకుండా స్టంట్స్ మాత్రం వేసి ప్రాబ్లెమ్ క్లియర్ చేశారు డాక్టర్స్. అంతేగాదు ఆస్పత్రి బిల్ మొత్తం తానే కట్టారు. చిరు చేసిన సాయంపై అంతా ప్రశంసలు గుప్పిస్తున్నారు. చిరంజీవికి తాను ఎల్లప్పుడు రుణపడి ఉంటానని ప్రభు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -