Thursday, May 16, 2024
- Advertisement -

ఆమె డాన్సులు చూసి.. తన పక్కన ఛాన్సిస్తున్న చిరు?!

- Advertisement -

మొత్తానికి రెజీనా నక్కతోక తొక్కేసిందని టాక్ వస్తోంది., ఇంత వరకూ మెగా ఫ్యామిలీలో చిన్న హీరోల సరసన నటిస్తున్న ఆమెకు అంతిమంగా మెగా స్టార్ పక్కన నటించే అవకాశం లభించినట్టు భోగట్టా.

ఇన్ని రోజులూ సరైన బ్రేక్ కోసం.. ఒక బడా సినిమా కోసం ఎదురుచూస్తు ఆమె నిరీక్షణ ఏకంగా మెగాస్టార్ సినిమాతోనే ఫలించబోతోందని సమాచారం. ఇప్పటికే చిరంజీవి సినీ రీ ఎంట్రీ ఖాయం అయిన సంగతి తెలిసిందే. చరణ్ సినిమాలో నటిస్తున్న చిరంజీవి.. ఆ తర్వాత సోలో హీరోగా తమిళ ‘కత్తి’ రీమేక్ లో నటించబోతున్నట్టుగా ఖాయమైంది.

ఇలాంటి నేపథ్యంలో ఆ సినిమా లో హీరోయిన్ ఎవరనేది కూడా ఆసక్తికరమైన విషయమే కదా. తన సినిమాకు తనే ఎవరో ఒకరిని హీరోయిన్ గా ఎంపిక చేసుకునే అధికారం కూడా చిరంజీవికి ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ దృష్టిలో రెజీనా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకించి మొన్న సాయిధరమ్ తేజ సినిమాలో ఆమె చేసిన డాన్సులు చూసి చిరంజీవి ఫ్లాట్ అయ్యాడని సమాచారం. ఆమెను తన పక్కన నటింపజేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్. మరి ఇదే నిజమయితే రెజీనాకు అంతకు మించిన అదృష్టం ఉండదు. మరేం జరుగుతుందో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -