Saturday, May 4, 2024
- Advertisement -

అయ్యో.. చరణ్ సినిమాలో విలన్ గా ఆ స్మైలీ హీరోనా!

- Advertisement -

ఇప్పటికే తెలుగు వెర్షన్ “తనీ ఒరువన్’ సినిమా లో విలన్ పాత్ర విషయంలో చాలామంది పేర్లు ప్రతిపాదనలోకి వచ్చాయి. చరణ్ హీరోగా రూపొందే ఈ రీమేక్ సినిమాలో విలన్ గా మొదటఅరవింద్ స్వామి నటిస్తాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన అంత ఆసక్తి చూపడటం లేదంటూ నాగార్జున పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆ పుకార్లపై నాగార్జున  మండిపడినట్టుగా తెలిసిందే. మల్టీ స్టారర్ లో నటించడానికి పెద్దగా అభ్యంతరం చెప్పడు కానీ.. ఇలా హీరోల చేత దెబ్బలు తినడానికి మాత్రం నాగార్జున ఒప్పుకోకపోవచ్చు.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా రీమేక్ విలన్ గా మరో ప్రముఖ హీరో పేరు చర్చలోకి వచ్చింది. 

ఆయనే మాధవన్. ఈ తమిళ హీరోని తెలుగు వెర్షన్ లో విలన్ గా చూపాలని భావిస్తున్నారట. మరి మాధవన్ చాలా మందిఅమ్మాయిలకు ప్రియమైన వాడు. స్మైలీ హీరోగా పేరు పొందిన వ్యక్తి. లవ్లీ రొమాంటిక్ సినిమాల్లో నటించిన నేపథ్యం ఉన్న వ్యక్తి. మరి అలాంటి హీరో ఇప్పుడు విలన్ గా నటిస్తే చాలా మంది అమ్మాయిల హృదయాలు గాయపడతాయి. తమ అభిమాన హీరోని వారు అలా చూసి సహించలేకపోవచ్చు. మరి మాధవన్ కన్పర్మ్ ఏనా? అంటే మాత్రం చెప్పలేని పరిస్థితి.

ఎందుకంటే.. ఇప్పటికే ఈ సినిమా విషయంలో విలన్ గా ఇద్దరు ముగ్గరు పేర్లు తెరపైకి వచ్చాయి. మరి మాధవన్ అయినా ఖాయం అనుకోవడానికి లేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఇదొక సందేహాస్పదమైన విషయమే! 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -