హీరో విశాల్ ఏంటీ సెటిల్మెంట్ ఏంటీ అనుకుంటున్నారా. ఏం లేదండీ విశాల్ హీరోగా నటించిన పందెం కోడి-2 విడుదలకు రెడీ అవుతుంది.విశాల్‌కు తమిళంతోపాటు ,తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే.విశాల్ నటించిన అభిమాన్యుడు సినిమా తెలుగులో కూడా మంచి విజయం సొంతం చేసుకుంది.దీంతో పందెం కోడి -2 కి తెలుగులో భారీ రేట్లు చెబుతున్నాడు విశాల్.అయితే విశాల్ అభిమన్యుడుకి ముందు నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు.దీంతో విశాల్‌కు బయ్యర్ల నుండి ఒత్తిడి మొదలైందని తెలుస్తోంది.
విశాల్ సినిమాలు కొని నష్టపోయిన బయ్యర్లంతా ఒక్కటిగా తయారై విశాల్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట.అభిమన్యుడు కాకుండా అంతకముందు విశాల్ నటించిన సినిమాలు కొని నష్టపోయిన వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. విశాల్‌కు వీరిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది.బయ్యర్లకు న్యాయం చేసిన తరువాతే సినిమాను విడుదల చేయలనే ఆలోచనలో ఉన్నాడు విశాల్.పందెం కోడి- 2ని దసరాకు కానుకగా ఈ నెలలో విడుదల చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=3DxYocwhAYs