Thursday, May 2, 2024
- Advertisement -

హీరోలను విలన్లుగా మారుస్తున్న స్టార్ డైరెక్టర్ !

- Advertisement -

ఈ మద్య కాలంలో తమిళ్ డైరెక్టర్ లోకేశ్ కనకారాజ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. మాస్ మూవీస్ ను స్టైలిష్ గా తీస్తూ అద్భుత విజయాలను అందుకుంటున్నాడు ఈ యువ డైరెక్టర్. ఇక ఈ ఏడాది కమల్ హాసన్ తో తెరకెక్కించిన ” విక్రమ్ ” మూవీ పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా తమిళ్ లో 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాంతో అందరి దృష్టి ఒక్కసారిగా లోకేశ్ పై పడింది. ముఖ్యంగా తెలుగు హీరోలు లోకేశ్ డైరెక్షన్ లో నటించేందుకు విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ విషయం అలా ఉంచితే.. లోకేశ్ మూవీస్ లలో హీరోలతో ధీటైన పాత్రలలో విలన్లు కనిపిస్తారు. మాస్టర్ మూవీలో విజయ్ సేతుపతి భవానిగా ఏ స్థాయిలో రెచ్చిపోయాడో అందరికీ తెలిసిందే. .

ఇక అలాగే ఇటీవల వచ్చిన విక్రమ్ మూవీ లో కూడా సంతానం గా విజయ్ సేతుపతి, అలాగే రోలెక్స్ గా సూర్య విలన్లుగా అదరగొట్టారు. ఇక లోకేశ్ తన తదుపరి మూవీలో కూడా ఓ స్టార్ హీరోను విలన్ తీసుకోబోతున్నట్లు తమిళ్ సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకేశ్ కనకారాజ్ తన తరువాతి సినిమాను తలపతి విజయ్ తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో తమిళ్ స్టార్ హీరో విశాల్ ను విలన్ గా తీసుకోబోతున్నాడట. ఇప్పటికే విశాల్ తో సంప్రదింపులు కూడా జరిపారని, అందుకు విశాల్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక విశాల్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. దాంతో విశాల్ విలన్ గా చేస్తే మూవీపై మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది. ఈ వైరల్ అవుతున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని, ఒకవేళ నిజం అయితే మాత్రం విశాల్ విలన్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి. మొత్తానికి తన సినిమాల్లో స్టార్ హీరోలను విలన్లు గా చేస్తూ సరికొత్త ట్రెండ్ కు తెరతీశాడు లోకేశ్ కనకారాజ్.

ఇవి కూడా చదవండి

డెడికేషన్ అంటే ఇది.. ఫిదా చేస్తోన్న రామ్ చరణ్ !

అల్లు అర్జున్ ” ఐకాన్ ” లేనట్లేనా ?

ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్..హీరోలు ఎవరో తెలిసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -