Friday, May 3, 2024
- Advertisement -

విశాల్ సంచలన ఆరోపణలు..సెన్సార్ పరిస్థితేంటీ?

- Advertisement -

సినీ నటుడు,నిర్మాత,దర్శకుడు విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమా కోసం సెన్సార్ బోర్డు సభ్యులకు లంచం ఇచ్చానని చెప్పి సంచలన ఆరోపణలు చేశారు. విశాల్ నటించిన మార్క్ ఆంటోని సెప్టెంబర్ 15న విడుదల కానుండగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. దాదాపు రూ. 50 కోట్ల షేర్ (రూ. 92 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

అయితే తెలుగు, తమిళంలో సినిమా విడుదల కాగా హిందీలో విడుదల చేసేందుకు విశాల్ ప్రయత్నించారు. అయితే హిందీలో సినిమా సెన్సార్ చేయడానికి అక్కడి బోర్డు సభ్యులు తనని లంచం అడిగారని చెప్పుకొచ్చారు. స్క్రీనింగ్ కోసం రూ. 3.5లక్షలు.. సర్టిఫికేట్ కోసం మరో రూ. 3 లక్షలు చెల్లించానని మొత్తం రూ. 6.5 లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. విధిలేని పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సివచ్చిందని…భవిష్యత్తులో ఏ నిర్మాతకు కూడా ఇలాంటి పరిస్థితి రాకుడదన్నారు.

సినిమాల్లోనే అవినీతి గురించి చూశా…కానీ ఇప్పుడు రియల్ చూడటం బాధేసిందని..దీనిని ప్రధాని మోడీతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే‌కు ట్యాగ్ చేశారు. మరి దీనిపై సెన్సార్ బోర్డు సభ్యులతో పాటు ప్రధాని, మహారాష్ట్ర సీఎం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -