Thursday, May 9, 2024
- Advertisement -

దర్శక-నిర్మాతల ఫైట్‌..డెవిల్‌కి బ్రేక్!

- Advertisement -

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నవీన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. నవీన్‌కి ఇది తొలిచిత్రం కాగా అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో అభిషేక్ నామా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటించగా న‌వంబ‌ర్ 24న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

అయితే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ‘మాయే చేసే’ అనే సాంగ్ కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ తో దర్శక- నిర్మాత మధ్య విభేదాలు బయటపడ్డాయి. పోస్టర్‌లో దర్శకుడు నవీన్ పేరుని తీసేసి నిర్మాత అభిషేక్ నామా తన పేరుని వేసుకున్నాడు. అంతేగాదు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అని ఉండటం టీ టౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇక అభిషేక్ నామాకు కౌంటర్‌గా వినాశకాలే విపరీత బుద్ధి అంటూ పేర్కొన్నారు దర్శకుడు నవీన్. దీంతో వీరిద్దరి మధ్య ఏం జరిగిందోనని రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి నిర్మాత అభిషేక్ నామా ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి. మరి దర్శక నిర్మాతల మధ్య ఫైట్‌తో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -