Wednesday, May 1, 2024
- Advertisement -

బాలీవుడ్‌ – టాలీవుడ్‌ ‘బాద్‌ షా’ ఇద్దరు కలిస్తే!

- Advertisement -

బాలీవుడ్ – టాలీవుడ్ బాద్ షా ఇద్దరు కలవబోతున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. రీసెంట్‌గా షారుఖ్ నటించిన జవాన్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో జవాన్ సినిమా చూసిన బన్నీ…షారుఖ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. షారుఖ్ మాస్ అవతార్‌తో మెప్పించాడని కొనియాడారు బన్నీ. అలాగే చిత్ర బృందం మొత్తాన్ని అభినందించారు.

ఇక బన్నీ ట్వీట్‌తో ఫిదా అయ్యారు షారుఖ్‌. పుష్ప సినిమాని మూడు సార్లు చూశానని…ఇందులో మీ నుండి ఎంతో నేర్చుకున్నానని బన్నీపై ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్ – బాలవుడ్ బాద్‌ షా ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రశంసలు గుప్పించుకోవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. త్వరలోనే బన్నీని కలుస్తానని చెప్పారు. దీంతో వీరిద్దరి భేటీ త్వరలోనే ఉండనుందని తెలుస్తోంది.

ఇక బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప 2 …2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది పుష్ప. ఈ సినిమాలో నటనకు గానే బన్నీకి జాతీయ స్ధాయిలో ఉత్తమనటుడిగా అవార్డు వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -