బాలీవుడ్ వర్గాల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించిన ట్రయాంగిల్ లవ్‌స్టోరీ చిత్రం ‘కాక్‌టెయిల్ 2’ (Cocktail 2) త్వరలోనే డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. చాహక హీరో షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా, కృతిసనన్ ప్రధాన నాయికలుగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు హోమీ అదజానియా అత్యంత స్టైలిష్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం, గత జూన్ 19న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు థియేట్రికల్ రన్ ముగించుకుని అధికారికంగా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) వేదికగా ఆగస్టు 14 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
దీపికా పదుకొణె, సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ హిట్ సినిమా ‘కాక్‌టెయిల్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంపై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను సాధించింది. ప్రత్యేకించి 2026 సంవత్సరంలో విడుదలై, కేవలం తొలి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల కలెక్షన్ల మైలురాయిని దాటిన కొన్ని ట్రెండింగ్ హిందీ సినిమాల్లో ‘కాక్‌టైల్ 2’ ఒకటిగా నిలిచి ఘనత సాధించింది. షాహిద్ కపూర్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, రష్మిక మందన్నా గ్లామర్, కృతిసనన్ అభినయం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
థియేటర్లలో ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను మిస్ అయిన ప్రేక్షకులు, లేదా మరోసారి థియేట్రికల్ ఫీల్‌ను ఓటీటీలో ఆస్వాదించాలనుకునే సినీ ప్రియులు ఆగస్టు 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్రస్తుత ట్రెండ్‌కు తగినట్లుగా మోడ్రన్ రిలేషన్‌షిప్స్, భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం డిజిటల్ వేదికపై ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.
