తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ ఆలీకి ఎంత మంచి పేరుందో , అంతే చెడ్డ పేరు కూడా ఉంది. తన మాటలతో చాలసార్లు చిక్కుల్లో పడ్డాడు ఆలీ. పలు సినిమా ఈవెంట్‌ల్లో ఆలీ డబుల్ మీనింగ్ డైలాగులు వాడి విమర్శల పాలైయ్యాడు. గతంలో సుమ, సమంత, అనుష్కలపై నోరు జారిన ఆలీ తాజాగా మరోసారి తన నోటికి పని చెప్పాడు.బుధవారం రాత్రి జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో సుమపై భర్త రాజీవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆలీ. ‘లవర్స్ డే’ ఆడియో లాంచ్‌లో హీరోయిన్ ప్రియా ప్రకాష్‌ను వేదిక మీదకు పిలిచే క్రమంలో .. ప్రియా ప్రకాష్‌ను తన చెల్లెలుగా అభివర్ణించింది సుమ.
పక్కనే ఉన్న ఆలీ మైక్ తీసుకుని ప్రియా వారియర్ నీ చెల్లెలు అయితే హీరో రోషన్ మీ కొడుకా అని సుమని ప్రశ్నించాడు ఆలీ. దీనికి సుమ అవునని సమాధానం ఇచ్చింది. వెంటనే ఆలీ రాజీవ్ ఎప్పుడు కేరళ వెళ్లాడు అని డబుల్ మీనింగ్‌లో మాట్లాడాడు ఆలీ. రాజీవ్‌కు ఇంత పెద్ద కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడో… అని హేళన చేశాడు. ఈ విషయం పెద్దది కాకుండా వెంటనే సుమ టాపిక్‌ను మార్చేసింది.గతంలో మహిళలపై కూడా ఆలీ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పలు మహిళ సంఘాలు అప్పట్లో ఆలీ ఇంటి వద్ద అందోళన కూడా చెప్పట్టాయి. అయినప్పటికి ఆలీలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!