Wednesday, May 1, 2024
- Advertisement -

పవన్‌కళ్యాణ్‌ పార్టీలోకి వెళ్తా..

- Advertisement -

హాస్యనటుడు సప్తగిరి ఈ మ‌ధ్య హీరోగా మారాడు.మొద‌టి సినిమా సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ హిట్ కొట్ట‌డంతో ఇంకా హీరోగా, హాస్యనటుడుగా త‌న సినీ ప్ర‌యాణం కొన‌సాగిస్తున్నాడు సప్తగిరి.త‌న రెండోవ సినిమా సప్తగిరి ఎల్.ఎల్.బి. కూడా మంచి విజ‌యం సాధించ‌టంతో చిత్ర యూనిట్ విజయోత్సవ యాత్రకు పునుకుంది.అయితే సప్తగిరి విజయోత్సవ యాత్రలో భాగంగా కొన్ని ఆశ‌క్తిక‌ర వాఖ్య‌లు చేశారు.శనివారం సప్తగిరి సొంత జిల్లా అయిన చిత్తూరులోని ఎమ్మెస్సార్‌ థియేటర్‌ను చిత్ర యూనిట్ సందర్శించింది.

ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకి సప్తగిరి సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్ గురించి ఏం చెబుతారు అని విలేకరి అడిగిన ప్రశ్నకి సప్తగిరి సమాధానం ఇస్తూ ‘‘పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. చిత్తూరు జిల్లా నుంచి వెళ్ళిన వ్యక్తికి హీరో అవుతున్నాడంటే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వచ్చి తమ్ముడు నీకు నేనున్నానని ఆయన అభయమిచ్చారు’’ అని తెలిపారు.

పవన్‌ కల్యాణ్ పార్టీలోకి వెళ్తారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ‘‘రాజకీయాలపై నాకు అంత అనుభవం లేదు. అయితే పవన్‌ కల్యాణ్ వెంట ఉండటానికి నేను రెడీ. అన్నారు. పవన్‌ కల్యాణ్ పిలిస్తే ఖ‌చ్చితంగా వేళ్తా అని స‌ప్త‌గిరి చేప్పాడు .దీనిపై జ‌న‌సేన అధినేత పవన్‌ కల్యాణ్ స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -