Friday, April 26, 2024
- Advertisement -

విడాకుల గురించి సుమంత్ ఏం చెప్పాడంటే?

- Advertisement -

సుమంత్ అక్కినేని మ‌న‌మ‌డిగా ప‌రిచియ‌మైన ఎందుకో అనుకున్నంత హిట్లు, క్రేజ్‌ లేదు.అడ‌పాడ‌ద‌పా సినిమాలు చేస్తున్న హిట్ మాత్రం రావ‌ట్లేదు ఈ చిన్నోడికి. ఈ మ‌ధ్య ‘మళ్లీ రావా’ అనే మ‌రో సినిమాతో వచ్చాడు. ఈ సినిమా పై రివ్యూస్‌,అన్ని బాగానే ఉన్న‌ప్ప‌టీకి క‌లెక్ష‌న్స్ మాత్రం అనుకునంత లేవ‌నే చేప్పాలి.అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో సుమంత్ త‌న వైవ‌హిక జీవితాన్ని గురించి చేప్పాడు.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్‌క‌ల్యాణ్ న‌టించిన `తొలిప్రేమ‌` సినిమాతో తెలుగు వారిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది కీర్తి రెడ్డి. ఆ సినిమాతో ఆమెకు తెలుగులో భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత‌ తెలుగు హీరో సుమంత్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆ బంధం ఎంతో కాలం నిల‌వ‌లేదు. ప్రేమించి, పెళ్లి చేసుకున్నా రెండేళ్లు కూడా వారు క‌లిసి ఉండలేక‌పోయారు. సుమంత్‌తో విడాకులు తీసుకున్న కీర్తి మ‌రో వ్య‌కిని పెళ్లి చేసుకుని, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయింది. సుమంత్ మాత్రం మ‌రో పెళ్లి చేసుకోలేదు. అస‌లు కీర్తితో విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వ‌చ్చిందో తాజాగా సుమంత్ చెప్పాడు.

పెళ్లి త‌ర్వాత ఏడాదిన్న‌ర మాత్ర‌మే మేం క‌లిసున్నాం. ఆ స‌మ‌యంలోనే మా జీవితాలు వేరు, మా వ్య‌క్తిత్వాలు వేరు అని అర్థ‌మైంది. ఇక‌, ఎంతోకాలం క‌లిసి ఉండ‌లేమ‌ని అర్థ‌మ‌వ‌డంతో ఉమ్మ‌డి అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. కీర్తి మ‌రో పెళ్లి చేసుకుని ఇద్ద‌రు పిల్ల‌ల‌తో సంతోషంగా ఉంది. అది నాకు చాలా ఆనందాన్ని క‌లిగించే విష‌యం. ఆమె ఇప్ప‌టికీ నా ఫ్రెండే. ఆమెతో అప్పుడ‌ప్పుడు మాట్లాడుతుంటా. తాత ఏఎన్నార్ చనిపోయిన‌పుడు చివ‌రిసారి కీర్తి ఇక్క‌డ‌కు వ‌చ్చింద`ని సుమంత్ చెప్పాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -