Friday, May 3, 2024
- Advertisement -

నాని మెప్పించాడా?

- Advertisement -

భారీ అంచనాల మ‌ధ్య తెలుగు బిగ్‌బాస్ రెండువ సీజ‌న్ ఆదివారం నాడు ప్రారంభం అయింది.బిగ్‌బాస్ రెండువ సీజ‌న్‌కు న్యాచుర‌ల్ స్టార్ నాని వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసింది.బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ఎన్టీఆర్, షోని అన్ని తానై ముందుకు న‌డిపించాడు.బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్ అంత పెద్ద హిట్ కావ‌డానికి ఎన్టీఆర్ ఒక కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.

త‌న స‌హ‌జ న‌ట‌న‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని కూడా మెప్పించాడు ఎన్టీఆర్.త్రివిక్ర‌మ్ సినిమాతో బిజిగా ఉండ‌టం వ‌ల్ల ఎన్టీఆర్ బిగ్‌బాస్ రెండువ సీజ‌న్‌కు దూరం అయ్యాడు.ఇక బిగ్‌బాస్ రెండువ సీజ‌న్‌కు నానిని యాంక‌ర్‌గా ఎంపిక చేశారు బిగ్‌బాస్ టీం.దీంతో నాని యాంక‌రింగ్‌పై ఎన్నో అనుమానాలు ఏర్ప‌డ్డాయి.నాని ఎన్టీఆర్‌లా మెప్పించ‌గ‌లాడా!అనేది అంద‌రి మ‌న‌స్సులోనూ ఉంది.ఇక నిన్న‌(ఆదివారం) ప్రారంభం అయిన బిగ్‌బాస్‌-2 సీజ‌న్‌లో నాని యాంక‌రింగ్‌పై భిన్న‌స్వ‌రాలు వినిపిస్తున్నాయి.

కొంద‌రు నాని బాగా చేశాడ‌ని అంటుంటే,మ‌రికొంద‌రు ఎన్టీఆర్‌ను ఫాలో అయ్యాడ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.మ‌రిరొంద‌రు నాని చేసింది ఒక్క ఎపిసోడే క‌దా!అప్పుడే ఎలా డిసైడ్ చేస్తార‌ని అంటున్నారు.మొత్త‌నికి బిగ్‌బాస్ -2 ప్రారంభ ఎపిసోడ్‌లో నానికి యావ‌రేజ్ మార్కులే పడ్డాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -