Monday, May 13, 2024
- Advertisement -

కొత్త హామీలు ఎప్పుడిస్తాం అన్న నేతకు షాకింగ్ కౌంటర్ ఇచ్చిన బాబు

- Advertisement -

2019 ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. జగన్, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ కూడా కొత్త కొత్త హామీలు ఇస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తొలిసంతకం ప్రత్యేక హోదా ఫైలుపైనే అని చెప్పుకుంటూ ఉంది. మరి చంద్రబాబు నుంచి ఎలాంటి కొత్త హామీలు ఎందుకు రావడం లేదు? ఎంత సేపూ బిజెపిని అతిపెద్ద విలన్‌గా చూపించడం, ఆ విలన్‌కి సహకరిస్తున్న పార్టీలు, వ్యక్తులుగా జగన్, పవన్‌లతో పాటు రమణదీక్షితులులాంటి వాళ్ళతో పాటు తనను విమర్శిస్తున్న వాళ్ళు అందరినీ చిత్రీకరిస్తూ ఉండడంతోనే కాలం గడిపేస్తూ ఉన్నాడు చంద్రబాబు.

అయితే ప్రజలు మాత్రం బిజెపితో కలిసి నాలుగేళ్ళుగా చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ఇంకా మర్చిపోలేదు. పొత్తు ధర్మం పాటిస్తూ హోదా ఇవ్వకపోయినప్పటికీ బిజెపిని ఏమీ అనలేని స్థితిలో ఉన్నానని బాబు డొంకతిరుగుడు సమర్థన చేసుకుంటున్నాడు. అయితే ప్రజలు మాత్రం బాబును కొన్ని ఘాటు ప్రశ్నలు అడుగుతున్నారు. హోదా ఇవ్వని బిజెపిని పొత్తు ధర్మం కారణంగా ఏమీ అనలేకపోయావ్. కానీ హోదా వేస్ట్, ప్యాకేజ్ బెస్ట్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎందుకు మభ్యపెట్టాలని చూశావ్ అని బాబును ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

హోదా పేరెత్తితే అరెస్టే అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అందుకే ఎంత సేపూ బిజెపి పాపాన్ని తిట్టడం, ఆ పాపాలకు జగన్, పవన్‌లు కూడా సహకరిస్తున్నారని చెప్పడం తప్ప 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి కొత్త హామీలు ఉండవా అని అడిగిన టిడిపి సీనియర్ నేతకు చంద్రబాబు దిమ్మతిరిగే కౌంటర్స్ ఇచ్చాడు.

రుణమాఫీలు, నిరుద్యోగ భృతి అనుభవం తర్వాత ఇప్పుడిక ఎలాంటి హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే అవకాశమే లేదని, అందుకే బిజెపి నుంచి రాష్ట్రానికి, టిటిడికి ….ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏదో ఆపద పొంచి ఉందని ప్రచారం చేసి…..ఆ ఆపద నుంచి కాపాడే దేవుడు చంద్రబాబేే అని ప్రజలను నమ్మించి 2019 ఎన్నికల్లో గెలుద్దామని చెప్పాడట చంద్రబాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క టిడిపి నేత కూడా 2019 ఎన్నికలే లక్ష్యంగా కొత్తగా ఇవ్వబోయే హామీలు అంటూ ఎలాంటి వ్యాఖ్యలు కూడా చెయ్యొద్దని టిడిపి నేతలను హెచ్చరించాడట. మొత్తానికి 2014 ఎన్నికల్లో 600హామీలకు పైగా ఇచ్చి అధికారం దక్కించుకున్న చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో పూర్తి స్పష్టత ఉందన్న విషయం బాబు మాటల్లోనే తెలిసిపోతోందని టిడిపి నాయకులే చర్చించుకుంటున్నారు.

2014లో తాను ఇచ్చిన హామీలతో పాటు, కేంద్రం నుంచి సాధించుకొస్తా అని చెప్పిన హామీలు ఏవీ నెరవేరని నేపథ్యంలో ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చినా నమ్మరని…….అందుకే రాష్ట్రానికి ఏదో ప్రమాదం ఉందని నమ్మించి…ఆ ప్రమాదం నుంచి కాపాడే అనుభవం బాబు ఒక్కడికే ఉందని…….రాష్ట్రాంలో జగన్‌తో సహా ఇంకెవరికీ అధికారం అప్పగించినా రాష్ట్ర ప్రజలందరూ దిక్కూదివాణం లేకుండా పోతారని ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు బాబు అండ్ కో. 2014 ఎన్నికల్లో అనుభవం అని చెప్పి అధికారంలోకి వచ్చిన బాబు ఈ సారి కూడా అదే అనుభవం పేరు చెప్పి, రాష్ట్రాన్ని కబళించడానికి వస్తున్న బూచీ ఏదో ఉందని ప్రజలను నమ్మంచి…..ఆ బూచీ నుంచి కాపాడే అనుభవం నాకే ఉందని చెప్పి అధికారం దక్కించుకోవాలనుకుంటున్నారు. బాబు మార్క్ వ్యూహానికి మరోసారి సీమాంధ్రులు ఓటర్ల వర్షం కురిపిస్తారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -