టాలీవుడ్ ని కరోనా వైరస్ కవలరపెడుతోంది. ఆ మాటకొస్తే టాలీవుడ్ కే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలపైనా ఒమిక్రాన్ ప్రభావం ఉంది. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేశ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లతో పాటు మంచు లక్ష్మికి కూడా వైరస్ సోకింది.
రెండేళ్లుగా ప్రపంచమంతా కరోనా తప్ప మరో విషయం లేదు. కరోనా చుట్టూనే అందరి ఆలోచనలు నడుస్తున్నాయి. జీవితాలను ఆ స్థాయిలో ప్రభావితం చేసింది కరోనా. సెకండ్ వేవ్ లో కూడా కొందరు తారలకు సొకిన కరోనా ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో రచ్చ చేస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు పాజిటివ్ గా తేలిందని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. మహేశ్ బాబు కరోనా బారిన పడడం టాలీవుడ్ ని కలవర పెడుతోంది. ఆయన రెగ్యులర్ గా షూటింగ్ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. దీంతో ఇటీవల వరకూ ఆయనతో షూటింగ్ లో పాల్గొన్న అందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే, మహేష్ తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు.
అటు టాలెండెట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు సైతం కరోనా సోకింది. ఇక మంచు కుటుంబాన్ని కరోనా వదలట్లేదు. కొద్ది రోజుల క్రితమే మనోజ్ కు కరోనా సోకితే, ఇప్పుడు మంచు లక్ష్మి పాజిటివ్ అని తేలింది. అన్ని జాగ్రత్తల మధ్య ఉండే సెలబ్రిటీలనే వదలకపోతే, సామాన్యుల సంగతేమిటా అనే ప్రశ్న వినిపిస్తోంది. అసలే టిక్కెట్లు, థియేటర్ల మూత, లిమిటెల్ షోల కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీని ఇప్పుడు కరోనా మరింత దెబ్బ కొట్టేలా కనిపిస్తోంది.
మొన్న నాని, నిన్న వర్మ, నేడు నాగార్జున