సమంత ఎలా ఊ.. అందో తెలుసా?

- Advertisement -

డిసెంబర్‌ 17న రిలీజ్‌ అయిన ‘పుష్ప ది రైజ్‌’ పాన్‌ ఇండియా రేంజ్‌ లో రిలీజ్‌ అయి, రికార్డు స్థాయిలో వసూళ్లు చేస్తోంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పెర్ఫామెన్స్‌ ఒక ఎత్తైతే, సమంత ఐటెమ్‌ సాంగ్‌ కూడా ఓ రేంజ్‌ లో పాపులర్‌ అయింద. ఊ.. అంటావా మామా ఉఊ అంటావా అంటూ సమంత చేసిన మొదటి ఐటెం సాంగ్స్‌ స్క్రీన్‌ ని హీటెక్కించింది.

నిజానికి ఈ సాంగ్‌ రిలీజ్‌ అయిన మొదటి రోజునుంచే అటు బాగా ఇంప్రెస్‌ అయిన వాళ్లు కొందరైతే, ఇది మగవాళ్లను అవమానిస్తోందని కేసుల వరకు వెళ్లిన వారు మరికొందరు. ఈ గోలంతా ఎలా ఉన్నా, అల్లు అర్జున్‌ తో కలిసి సమంత వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు థ్రిల్లయిన మాట వాస్తవం.

- Advertisement -

ఐదు భాషల్లో కలిపి 200మిలియన్‌ పైగా వ్యూస్‌ దక్కించుకున్న ఈ సాంగ్‌ యూ ట్యూబ్‌ రికార్డులు బ్రేక్‌ చేస్తోంది. అయితే, అసలు పాటే కాదు.. పాట వెనుక సంగతులు కూడా ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. దీనికి సమంత ఎలా ప్రాక్టీస్‌ చేసిందో చెప్తూ రిలీజ్‌ చేసిన వీడియో కూడా వైరల్ అవుతోంది. డాన్స్‌ మాస్టర్‌ తో కలిసి వేసిన స్టెప్స్‌ ఆడియన్స్‌ ని ఆకట్టుకుంటున్నాయి.

పెళ్ళికి సిద్దమైన సుడిగాలి సుధీర్.. అమ్మాయి ఎవరంటే..?

బాలయ్యను ఢీ కొట్టనున్న జయమ్మ

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -